anjan kumar yadav drunk and drive at pubsఎన్నికల వేళ పార్టీల నాయకుల మాటలు కోటలు దాటుతున్నాయి. కొందరు ఏకంగా ఏం మాట్లాడుతున్నారో, ఏం చేస్తామని చెప్తున్నారో అర్ధం లేకుండా పోతుంది. మొన్న ఒక ఆయన ఏకంగా అధికారంలోకి వస్తే ఇంటి అద్దె కట్టేస్తాం అని చెప్పేశారు ఇప్పుడు కాంగ్రెస్ హైదరాబాద్ అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్ ఒక అడుగు ముందుకేసి తనని తాను ఇంకాస్త దిగజార్చుకున్నారు.

తాము అధికారంలోకి వస్తే డ్రంక్ అండ్ డ్రైవ్ బంద్ చేసి కేవలం పబ్ ల దగ్గర మాత్రమే నిర్వహిస్తామని చెప్పుకొచ్చారు. మందు బాబుల ఓట్ల కోసం యాదవ్ గారి తాపత్రయంగా కనిపిస్తుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ లు బంద్ చెయ్యాలని ఈయనని ఎవరు అడిగినట్టు? అంటే కాంగ్రెస్ కు ఓటు వేస్తే సామాన్య జనం రోడ్ల మీద తిరగక్కర్లేదా?

ఫుల్లుగా మందు కొట్టి జనల మీదకు ఎక్కించి తొక్కించినా పర్లేదా? మారుతున్న కాలాన్ని బట్టి ప్రజలకు సివిక్ సెన్స్ పెరగాలి… రాజకీయ నాయకులు దానిని పెంచే ప్రయత్నం చెయ్యాలి. అంతే గానీ మాకు ఓటు వేస్తే మీ ఇష్టం… మీరు ఎలా ఉన్నా ఏం చేసినా మేము ఏమి పట్టించుకోము అని ప్రజలకు చెబితే సమాజం ఏమైపోతుంది? అసలు ఎన్నికల కమిషన్ ముందు ఇలాంటి వారి మీద యాక్షన్ తీసుకోవాలి.