anjali heroine oriented moviesటాలీవుడ్‌లో హీరోయిన్‌ ఓరియంటెడ్‌ చిత్రాలు అనగానే గతంలో విజయశాంతి గుర్తుకు వచ్చేది, ఇప్పుడేమో అనుష్క గుర్తుకు వస్తుంది. ‘అరుంధతి’ చిత్రంతో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్‌ను ఏర్పాటు చేసుకున్న అనుష్క వరుసగా హీరోయిన్‌ ఓరియంటెడ్‌ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. తాజాగా ఈమె ‘రుద్రమదేవి’ చిత్రంతో వచ్చి మెప్పించింది. ఇక ఈమె నటించిన ‘సైజ్‌ జీరో’ చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. ఈమె చేతిలో మరో రెండు హీరోయిన్‌ ఓరియంటెడ్‌ చిత్రాలు ఉన్నాయంటూ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. హీరోయిన్‌ ఓరియంటెడ్‌ చిత్రాలతో అనుష్క దూసుకు పోతున్న ఈ సమయంలో మరో హీరోయిన్‌ అంజలి కూడా వరుసగా హీరోయిన్‌ ఓరియంటెడ్‌ చిత్రాల్లో నటిస్తూ ఉంది.

‘గీతాంజలి’ చిత్రంతో మెప్పించిన అంజలి ప్రస్తుతం ‘చిత్రాంగధ’ అనే ఒక హర్రర్‌ లేడీ ఓరియంటెడ్‌ చిత్రంలో నటిస్తోంది. ఆ సినిమా పూర్తి కాకుండానే అంజలికి మరో హీరోయిన్‌ ఓరియంటెడ్‌ చిత్రంలో నటించే అవకాశం దక్కింది. జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు నీలకంఠ దర్శకత్వంలో అంజలి ఒక సినిమా చేయబోతుంది. తన మార్క్‌తో నీలకంఠ ఒక హీరోయిన్‌ ఓరియంటెడ్‌ కథను రెడీ చేశాడు. ఆ కథను తాజాగా అంజలికి వినిపించాడని, ప్రస్తుతం చేస్తున్న సినిమాలు పూర్తి అయిన వెంటనే అంటే వచ్చే సంవత్సరం ఆరంభంలో ఈ సినిమా చేద్దాం అని అంజలి చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈలోపు నీలకంఠ ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ను పూర్తి చేసుకోనున్నాడు. ఒక వైపు అనుష్క భారీ హీరోయిన్‌ ఓరియంటెడ్‌ చిత్రాలను చేస్తుంటే మరో వైపు అంజలి చిన్న చిత్రాలను చేస్తూ వెళ్తోంది.