Anil Ravipudi Next with Jr NTRఅనిల్ రావి పూడి…ఇప్పుడు టాలీవుడ్ లో ఈ యువ దర్శకుడు మంచి ఊపు మీద ఉన్నాడు. తన తాజా సినిమా ఎఫ్-2 తో ప్రేక్షకులను గిలిగింతలు పెట్టిస్తూ 100 కోట్ల క్లబ్ లో చేరిపోయాడు. అయితే ఇదే ఊపులో అనిల్ తన తర్వాత సినిమాపై పూర్తి ఫోకస్ చేస్తున్నాడు.

అయితే ఇదిలా ఉంటే తాజాగా ఒక ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో అనిల్ మాట్లాడుతూ తనకు ఎన్ఠీఆర్ తో ఛాన్స్ వచ్చింది అని, కానీ టైం లేకపోవడం వాళ్ళ ఆయనతో సినిమా మిస్ అయ్యింది అని అనిల్ చెప్పాడు. కళ్యాణ్ రామ్ తో పటాస్ సినిమా తర్వాత ఎన్ఠీఆర్ కి తానూ ఒక లైన్ చెప్పాను అని, ఆ లైన్ విపరీతంగా నచ్చేసిన ఎన్ఠీఆర్ సినిమా కథను పూర్తిగా చెప్పామన్నారు అని, ఆ విషయంలో కాస్త కుదరకపోవడం వల్ల ఎన్ఠీఆర్ తో సినిమా మిస్ అయిపోయింది అన్నది అనిల్ వాదన.

అయితే అనిల్ రావి పూడి టాలెంటెడ్ డైరెక్టర్, కాదని అనలేం. కానీ ఎన్టీఆర్, చెర్రీ, పవన్ కళ్యాణ్ ఇలాంటి వాళ్ళని డీల్ చెయ్యడం అంట ఈజీ కాదు, ఎందుకంటే వీళ్లంతా ఎంటెర్టైనేమేంట్ బేస్డ్ హీరోలు కాదు, పక్కా మాస్ హీరోలు. ఈ హీరోలను డీల్ చెయ్యడం రవి తేజ, వెంకీ,తో ఎంటర్టైన్మెంట్ పండించినంత ఈజీ కాదు, మరి కెరీర్ తోలి నాళ్ళలోనే ఎన్ఠీఆర్ తో సినిమా వచ్చింది, కానీ మిస్ అయ్యింది అని తెగ ఫీల్ అయిపోతున్న అనిల్, ఆ టైంలో ఎన్ఠీఆర్ ని డీల్ చెయ్యలేకపోయేవాడేమో.

ఏది ఏమైనా అనిల్ ఇప్పుడు ఉన్న ఊపులు ఎన్ఠీఆర్ పిలిచి మరీ సినిమా ఇచ్చిన ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు. చూద్దాం మరి ఒక వేళా అనిల్ కి ఎన్టీఆర్ సినిమా ఇస్తే ఎంతవరకూ న్యాయం చేస్తాడో.