Anil Ravipudi - next movie F3యువదర్శకుడు అనిల్ రావిపూడి తదుపరి ప్రాజెక్ట్ గురించి అనేక ఊహాగానాలు ఉన్నాయి. అయితే, ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరుతో బ్లాక్ బస్టర్ అందించిన ఈ దర్శకుడు తన తదుపరి ప్రాజెక్ట్ ఎఫ్ 3 స్క్రిప్ట్ కోసం పని చేస్తున్నారు. ఇది వెంకటేష్ మరియు వరుణ్ తేజ్ నటించిన అతని బ్లాక్ బస్టర్ చిత్రం ఎఫ్ 2 యొక్క సీక్వెల్.

అనిల్ రావిపుడి రచనా బృందం అతనితో పాటు స్క్రిప్ట్ పనులపై పనిచేస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా హైదరాబాద్ లో పని చెయ్యడానికి ఉన్న ఇబ్బందులు కారణంగా దర్శకుడు తన సొంతూరుకు వారందరినీ షిఫ్ట్ చేశాడట. ఈ ప్రాజెక్టులో రవితేజ, మహేష్ బాబు వంటి స్టార్స్ భాగమవుతారని గతంలో పుకార్లు వచ్చాయి, కాని దర్శకుడు వాటిని ధృవీకరించలేదు.

మరోవైపు ఈ చిత్రం గురించి గతంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన అనిల్… “ఎఫ్3 టోటల్ గా డిఫరెంట్ ప్రపంచం. మొగుడు పెళ్ళాల స్టోరీ కాదు. హీరో హీరోయిన్లు మాత్రమే వారే ఉంటారు. వారి కోరికలు, టార్గెట్స్ వేరుగా ఉంటాయి. అయితే ఎఫ్2 లోని కొన్ని మ్యానరిజమ్స్ మాత్రం కొనసాగుతాయి,” అని వివరించాడు.

వెంకటేష్ నారప్ప షూటింగ్ దాదాపుగా పూర్తి చేశారు. లొక్డౌన్ తరువాత ఆ సినిమా పూర్తి అవ్వగానే ఎఫ్ 3 మొదలు అవుతుంది. 2021 సంక్రాంతికి ఈ సినిమా విడుదలకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వరుణ్ తేజ్ మరో సినిమా షూటింగ్ లో బిజీగా ఉండటంతో అతను డేట్స్ ఎలా సర్దుబాటు చేస్తాడో కూడా చూడాల్సి ఉంది.