YCP MLA Insulted Ayyappa Mala?కార్తీకమాసం వస్తే రెండు తెలుగు రాష్ట్రాలలో సాధారణ భక్తులతో సహా వివిద రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు కూడా అయ్యప్పమాల వేసుకొని దీక్ష పూర్తికాగానే శబరిమల వెళ్ళి మొక్కులు చెల్లించుకొని వస్తుంటారు. అలాగే మాజీ మంత్రివర్యులు అనీల్ కుమార్‌ యాదవ్ కూడా అయ్యప్పమాల వేసుకొన్నారు. చాలా సంతోషం! కానీ నిన్న ముస్లింలతో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొనప్పుడు ఆయన ముస్లింలు ధరించే టోపీ, కండువా ధరించారు! అయ్యప్పమాల వేసుకొన్న భక్తులు దీక్ష ముగిసేవరకు నల్లదుస్తులు తప్ప మారేవీ ధరించకూడదనే నియమం ఉంది. కానీ అనిల్ కుమార్‌ యాదవ్ నల్లదుస్తులు ధరించి బొట్టు పెట్టుకొని పైన ముస్లింలు ధరించే టోపీ, కండువా ధరించారు.

తద్వారా ఆయన హిందూ, ముస్లిం రెండు మతాలను కించపరిచినట్లయింది. ఆయనకు అయ్యప్పదీక్ష చేయాలనుకొంటే పూర్తిగా ఆ నియమనిబందనలు పాటించాలి. ఒకవేళ ముస్లింలను గౌరవించాలనుకొంటే దీక్ష ముగిసిన తర్వాత వారి కండువా, టోపీ ధరించి వారి కార్యక్రమాలలో పాల్గొనవచ్చు. కానీ ఈవిదంగా కిందన అయ్యప్పదుస్తులు, పైన ముస్లిం టోపీ కండువా ధరించి రెండు మతాలను కించపరిచడం సరికాదనే చెప్పాలి.

దీనిపై బిజెపి ఎంపీ జీవీఎల్ నరసింహరావు తీవ్రంగా స్పందించారు, “స్వామి అయ్యప్ప దీక్షలో ముస్లింల టోపీ, కండువాలు వేసుకొని భక్తులను అవమానించిన వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. దీక్ష నియమాలు పాటించని ఎమ్మెల్యే శబరిమల వెళ్లకుండా అడ్డుకోవాలి. ఇటువంటి ఓటుబ్యాంక్ రాజకీయాలు హిందువులు సహించరని సీఎం జగన్‌ తెలుసుకోవాలి,” అని ట్వీట్ చేశారు.