ram charan decision on his next movieచిరంజీవి రాజకీయ రంగ ప్రవేశం రీత్యా మెగా కుటుంబానికి – రాజకీయాలకు మధ్య గట్టి బంధం ఏర్పడింది. అయితే ఇటీవల పవన్ పార్టీ పెట్టడంతో ఆ బంధం కాస్త మరింత బలపడింది. అంతలా పెనవేసుకుపోయిన మెగా కుటుంబంలో రాజకీయ కధ నేపధ్యంలో ఒక సినిమా తీస్తే ఎలా ఉంటుంది? దీనికి మెగా హీరోలు ఒప్పుకుంటారో లేదో గానీ, నేడు విడుదలైన “రన్” సినిమా దర్శకుడు అన్నే కన్నెగంటి మాత్రం చెర్రీతో ఒక పొలిటికల్ మూవీకి ప్లాన్ చేస్తున్నానని ప్రకటించారు.

‘మిస్టర్ నూకయ్య’ సమయంలోనే రాజకీయ నేపధ్యంలో సాగే కధను రామ్ చరణ్ కు వినిపించానని, చెర్రీకి కూడా ఆ కధ బాగా నచ్చిందని, అయితే కొన్ని అనివార్య కారణాల వలన అది పట్టాలెక్కలేదని, వచ్చే ఎన్నికల నాటికి మళ్ళీ ఒక పొలిటికల్ కధతో రామ్ చరణ్ తో ఒక సినిమాను తెరకేక్కిస్తానని అన్నారు. అయితే ప్రతిభను సక్సెస్ తో కొలమానంగా కొలిచే సినీ ఇండస్ట్రీలో సక్సెస్ లేనటువంటి కన్నెగంటికి రామ్ చరణ్ అవకాశం ఇస్తాడా లేదా అన్నది వేచి చూడాలి. నేడు విడుదలైన “రన్” సినిమాకు కూడా ఆశించినంత పబ్లిక్ టాక్ సొంతం కాకపోవడం విశేషం.