Angel Movie Teaser “కుమారి 21ఎఫ్” ద్వారా తెలుగు తెరకు పరిచయమైన హీబా పటేల్ యువ హృదయాలను దోచుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత మరో నాలుగైదు చిత్రాలలో కనిపించినప్పటికీ, ‘కుమార్ 21ఎఫ్’లో కనిపించినంత అందంగా మరో చిత్రంలోనూ కనిపించలేదు. అయితే మరోసారి “ఏంజెల్” చిత్రం ద్వారా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

‘బాహుబలి’ పళని దర్శకత్వం ఆవహించిన ఈ సినిమాలో నాగ అన్వేష్ హీరోగా నటిస్తున్నాడు. అమరావతిలో జరిగిన త్రవ్వకాలలో బయటపడిన విగ్రహాన్ని ఎలా దాటించాలనే కాన్సెప్ట్ ను చూపిస్తూ… మరో వైపు ‘అతిలోక సుందరి’ మాదిరి హీబా పటేల్ ను టీజర్ లో చూపించారు. చెప్పుకోవడానికి కొత్తగా ఏమీ లేకపోయినా హీబా అందాల ప్రదర్శనే హైలైట్ గా ఈ సినిమా నిర్మాణం జరుపుకుందని ఈ టీజర్ హింట్ ఇచ్చింది.