ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తొలి ఇన్నింగ్స్‌లో కొత్త మంత్రులు సెకండ్ బ్యాట్స్ మెన్‌గా చాలా ఉత్సాహంగా బరిలో దిగారు. కనుక చక్కగా బ్యాటింగ్ చేసి మంచి పేరు తెచ్చుకొంటారనుకొంటే అటువంటి ఆలోచన కూడా చేయకుండా, తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో కూర్చొని తమ బ్యాటింగ్‌ను లైవ్‌లో చూస్తున్న తమ కెప్టెన్‌ను ప్రసన్నం చేసుకోవడం పైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు.
ఆవిధంగా కొత్తగా బ్యాటింగ్‌కి దిగిన వారిలో మత్స్య, పశుసంవర్దకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు కూడా ఒకరు. ఆయన వయసు టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి రాజకీయ, పరిపాలన అనుభవమంత కూడా ఉండదు. అయినా తన కంటే ఎంతో అపార అనుభవమున్న చంద్రబాబు నాయుడిపై కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు నాయుడు కంటే వయసు, అనుభవం రెండూ తక్కువే అయినా జగనన్న మెప్పు కోసం ఎదో అలా మాట్లాడేశారని సరిపెట్టుకోవచ్చు.
కానీ ప్రజల మధ్యకు వచ్చి మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించి మాట్లాడాలని చంద్రబాబు నాయుడుకి హితవు చెప్పిన మంత్రి అప్పలరాజు, నిన్న శ్రీకాకుళం పట్టణంలో దిశ యాప్ డౌన్లోడ్ డ్రైవ్ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు, మంత్రి ధర్మాన ప్రసాదరావు, టేబిల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్, మహిళల సమక్షంలో మాట్లాడుతూ, “ఎవరైనా మహిళలను వేధిస్తే చూస్తూ ఊరుకోను. కోసి కారం పెడతా…జాగ్రత్త…” అని అనడంతో ఆ కార్యక్రమానికి వచ్చిన మహిళలు షాక్ అయ్యారు. ఓ మంత్రి హోదాలో ఉన్న సీదిరి అప్పలరాజు ఈవిధంగా మాట్లాడుతున్నారేమిటి? అని అనుకున్నారు. కానీ ఎంతైనా మంత్రిగారు కదా… అందుకని అందరూ ముసిముసి నవ్వక తప్పలేదు.
కనుక ఎదుట వాడివైపు ఒక వేలు ఎత్తి చూపుతుంటే, చేతిలో మిగిలిన నాలుగు వేళ్ళు మనవైపే చూపుతుంటాయని మరిచిపోకూడదు.
Dallas Kamma Folks Behind Acharya Sales?
Jagan Can’t Complete Full Term?