విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో మానసిక వికలాంగురాలిపై సామూహిక అత్యాచారం కేసులో టిడిపి నేతలు నిలదీస్తున్నందుకు వారిపై రాష్ట్ర మహిళా కమీషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ, మంత్రి రోజా ఎదురుదాడి చేస్తున్నారు. టిడిపి ప్రతిపక్షంలో ఉంది కనుక ఇటువంటి అమానుష ఘటనపై ప్రభుత్వాన్ని నిలదీస్తోంది.
కానీ వాసిరెడ్డి పద్మ, రోజా ఇద్దరూ బాధ్యతాయుతమైన పదవులలో ఉన్నవారే. ఇటువంటప్పుడు వారు సాటి మహిళ పట్ల సానుభూతి చూపాలని రాష్ట్రంలో మహిళలు కోరుకోవడం సహజం. వారిరువురూ బాధితురాలికి న్యాయం చేయడం గురించి ఆలోచించాలి. పోలీస్ శాఖపై ఒత్తిడి తెచ్చి దోషులకు కటిన శిక్షపడేలా చేయాలని ఆలోచించాలి. రాష్ట్రంలో మళ్ళీ ఇటువంటి హేయమైన నేరాలు జరుగకుండా నిఘా పెంచడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తామని చెప్పాలి.
కానీ సాటి మహిళపై సామూహిక అత్యాచారం జరిగితే బాధితురాలి గురించి ఆలోచించకుండా, తమను ప్రశ్నిస్తున్న టిడిపిపై వారు విరుచుకుపడుతుండటం చూసి ప్రజలు కూడా ఆశ్చర్యపోతున్నారు.
పరిపాలన, అభివృద్ధి, సంక్షేమం వంటి అంశాలపై వైసీపీ మంత్రులు, ప్రజా ప్రతినిధులు ఈవిదంగా ప్రతిపక్షాలపై ఎదురుదాడి చేస్తే ఎవరూ పెద్దగా పట్టించుకోకపోవచ్చు. కానీ తమ అధినేత మెప్పు కోసమో లేదా ప్రతిపక్షాల విమర్శల నుంచి తమ ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికో వారు తమ కనీస ధర్మం మరిచి ఇటువంటి సున్నితమైన అంశంపై ఈవిదంగా మాట్లాడితే ప్రజలు, ముఖ్యంగా రాష్ట్రంలో మహిళలు హర్షించరని గ్రహిస్తే మంచిది.
సున్నితమైన ఈ అంశంపై ఇంకా రాజకీయాలు చేస్తుంటే ప్రజల దృష్టిలో వారు, వారి ప్రభుత్వం ఇంకా పలుచనవుతాయని గ్రహిస్తే మంచిది.
Senior Actor Vexed With Pawan Kalyan!
Chay’s Dialogue Targeted at His Ex-wife?