YSR-Congress-Party Flagవైసీపీ నాయకులు తమకు అడ్డొస్తే అది ప్రతిపక్షమైనా., సొంత పార్టీ నాయకులైనా (ఆర్ఆర్ఆర్) వేధింపులకు వెనుకాడరనే వాస్తవాన్ని ఎన్నో సంఘటనల చేత ఋజువు చేస్తూనే వచ్చారు. అయితే వైసీపీ నాయకుల ఆగడాలు పెద్దల పైనే కాదు, పిల్లల పైన కూడా కొనసాగుతున్నాయని ఇటీవలే వెలుగులోకి వచ్చిన “మిస్బా” విద్యార్థిని ఉదంతంతో బయటకు వచ్చిందని టీడీపీ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు.

“చదువుల తల్లిని చంపేశారు” అంటూ ఇటీవలే ఓ ప్రముఖ దినపత్రికలో వచ్చిన వార్తలపై నిజా – నిజాలను తెలుసుకుని స్పందించారు టీడీపీ నేతలు. చిత్తూర్ జిల్లా పలమనేరులో పదోవ తరగతి చదువుతున్న ముస్లిం బాలిక మిస్బా, తన కూతురికి చదువులో పోటీగా మారిందని భావించిన వైసీపీ నేత, ప్రిన్స్ పల్ సహకారంతో పాఠశాల నుండి తొలగించినట్లుగా ఆరోపించారు.

మరో స్కూల్ కి మారిన మిస్బా మనసు మాత్రం వికలమైపోయి బలవన్మరణానికి సిద్దమై., తన బాధను వివరిస్తూ రెండు పేజీల సూసైడ్ నోటును రాసి ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంది. ‘తన కూతురే టాపర్ కావాలనే’ దుర్బుద్ధితోనే వైసీపీ నాయకులు మానసికంగా ఆ పాపను వేధించారని టీడీపీ ఆరోపిస్తుంది.

పేద ముస్లిం బిడ్డగా పుట్టడం పాపమైంది. బాగా చదడం శాపమైంది. అధికార పార్టీ అహంకారానికి పాప బలైంది అంటూ వైసీపీ నాయకుల ఆగడాలను ప్రజల ముందు ఉంచే ప్రయత్నం టీడీపీ సోషల్ మీడియా విభాగం చేస్తోంది. పాపం ఎంత బాధ పెడితే ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పుకోలేక నిస్సహాయ స్థితిలో లెటర్ రాసి పెట్టి ఆత్మహత్య చేసుకుంది? మిస్బా అంటూ ప్రశ్నిస్తున్నారు టీడీపీ నేతలు.

వైసీపీ ప్రజా ప్రభుత్వంలో పెద్దలకైనా., పిల్లకైనా విధానాలు ఇలానే ఉంటాయి, వారికి దయా – దాక్షణ్యాలు ఉండవు అంటూ టీడీపీ పార్టీ వైసీపీపై విమర్శల బాణాలను ఎక్కుపెట్టారు. తమ నేతలు చేసే ఎటువంటి ‘అరాచకాలకు.,అక్రమాలకు.,అన్యాయాలకు.., “ఇక్కడ శిక్షలు వర్తింపచేయబడవు జాగ్రత్త” అని బోర్డు పెట్టండంటూ టీడీపీ సోషల్ మీడియాలో వైసీపీ నేతలకు సలహాలిస్తున్నారు.