Kodali Nani YSRCP MLAగుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అంటే తెగించి మాట్లాడతాడు, దమ్ముగా మాట్లాడతాడు అనే బ్రాండ్ నేమ్ ఉంది. అలాంటి కొడాలి నాని గుడివాడలో కేసినో పెట్టినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా, పెట్రోల్ పోసుకుని తగల పెట్టుకుంటా అని సవాల్ విసరడమేంటి?

దీనికి బదులు టీడీపీతో ఇంకో పది పార్టీలు తీసుకుని ఊరంతా తిరిగి చెక్ చేసుకోండి. నిజ నిర్ధారణ లాంటి ఓ పది కమిటీలు వేసుకోండి… అని దమ్ముగా, తెగించి మాట్లాడితే కొడాలి నాని అవుతారు గానీ, ఇవాళ మాట్లాడింది కొడాలి నాని కాదు. తప్పు చేసి దొరికిపోయిన, భయపడిపోయిన ఓ రాజకీయ నాయకుడు.

అందుకనే అంతలా ప్రత్యర్థులపై అటాక్ కు వచ్చారు. సహజంగా మనుషులు రకరకాల మాటలు మాట్లాడతా ఉంటారు. ఎందుకంటే మానవజాతికి అంటూ ఓ భాష ఉంటుంది, అది మాతృ భాష లేక ఇతర భాషలను నేర్చుకుని అయినా మాట్లాడతా ఉంటారు. అలా కూడా చాలా పదాలు ఉంటాయి, చాలా పేర్లు ఉంటాయి.

కానీ కుక్కలు మాత్రమే చాలా పరిమితంగా తమ భాషను వాడుతుంటాయి. ‘బౌ బౌ’ అని లేకపోతే ‘ఊలపెట్టి ఏడ్చినట్లుగా’ ఆ ‘బౌ బౌ’లోనే నాలుగైదు వేరియేషన్స్ ఉంటాయి. ఒకటి, రెండు పదాలు తప్ప ఇంకేం మాట్లాడదు అది. మనుషులు అయితే చాలా మాట్లాడతారు, దీన్ని బట్టి మనం అర్ధం చేసుకోవచ్చు, అది ఎవరికి వర్తిస్తుందో ఏంటో అని?!

ఇది ప్రముఖ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి షో నిర్వాహకుడు వెంకటకృష్ణ కొడాలి నానిని ఉద్దేశించి చేసిన కొన్ని కీలక వ్యాఖ్యలు. కొడాలి వాడే పరిభాషను పక్కన పెడితే, వెంకటకృష్ణ చెప్పినట్లు ఓపెన్ గా టీడీపీ నేతలను వదిలేసి చెక్ చేసుకోమంటే నిజం నిగ్గుతేలేది కదా! ఒకవేళ అక్కడ ఏమి లేకపోతే ప్రజల దృష్టిలో టీడీపీ నేతలే ఫూల్స్ అయ్యే వారు కదా?

మరి పోలీసులను పెట్టి ఎందుకు అడ్డగించారు? తమ అనుచరుల చేత టిడిపి నేతలు, వాహనాలపై ఎందుకు దాడి చేయించారు? ఇక్కడే సమాధానం అందరికి లభిస్తుంది. తప్పు చేయని వారైతే నిజంగానే చెక్ చేసుకోమని వదిలేసి ఉండేవారు గానీ, ఇలా తమ అధికారాన్ని వినియోగించి పోలీసులను ప్రయోగించే వారు కాదు అన్నది ఇందులోని లాజిక్.