Jagan-Mohan-Reddyగ్రామ పంచాయితీలలో ఇంటి పన్ను ఎంత ఉంటుంది? ఇప్పటివరకు వందల్లో ఉండొచ్చు, లేదు అంటే నాలుగు అంకెలకు కాస్త అటు ఇటుగా ఉండొచ్చు. కానీ ప్రస్తుత ఇంటి పన్ను మాత్రం అయిదు అంకెలను తాకి అంతకంతకూ పెరుగుతూ పోతుండడం షాక్ కొట్టే విషయం.

తూర్పు గోదావరి జిల్లా, పెద్దాపురం మండలం, కట్టమూరు గ్రామ పంచాయితీ విడుదల చేసిన డిమాండ్ నోటీసులో ఏకంగా 14000 రూపాయలు కట్టాలంటూ పేర్కొనడం ప్రజల గుండెల్లో బాంబ్ పేల్చినట్లయ్యింది. ఇందులో ఇంటి పన్నుతో పాటు నీటి పన్ను, గ్రంధాలయ పన్ను, డ్రైనేజీ పన్నులు కూడా ఉన్నాయి.

ఒక్క ఇంటి పన్ను విలువే గ్రామ పంచాయితీలో 9459/- ఉందంటే, బహుశా ఆ ఇల్లు ఏ ప్యాలెస్ తరహాలో ఉండాలి. దానికి తోడు నీటి పన్ను 1892, గ్రంధాలయ పన్ను 757, లైటింగ్ పన్ను 946 మరియు డ్రైనేజీ పన్ను 946… మొత్తంగా రౌండ్ ఫిగర్ 14000 లెక్క కట్టారు.

ఇప్పటివరకు అర్బన్ ఏరియాలలో కూడా ఈ స్థాయిలో పన్నులు ఉండవు. మరి కొత్తగా జగన్ సర్కార్ తీసుకువచ్చిన పన్నుల బాదుడులో భాగంగా వీటిని విధించారో ఏమో ధ్రువీకరణ కావాల్సి ఉంది గానీ, సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ పిక్ మాత్రం భయబ్రాంతులకు గురి చేస్తోంది.