Andhra Pradesh youngest Coronavirus patientఆంధ్రప్రదేశ్‌లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,259 కు చేరుకుంది. గత 24 గంటల్లో రాష్ట్రంలో 82 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. 332 కేసులతో కర్నూలు, 254 కేసులతో గుంటూరు, 223 కేసులతో కృష్ణ.. రాష్ట్రంలోని మొత్తం కేసులలో 62% కంటే ఎక్కువ కేసులు ఈ మూడు జిల్లాలోనే ఉన్నాయి.

కర్నూల్ లో పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. జిల్లాలోని ఆస్పరి మండలం జొహారాపురం గ్రామంలో 11నెలల చిన్నారికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఆ కుటుంబానికి సంబంధించిన బంధువు ఒకరు దిల్లీ మర్కజ్ వెళ్లి రావడంతో వారందరినీ క్వారంటైన్ కు తరలించారు.

క్వారంటైన్ పూర్తిచేసుకున్న వారిని పరీక్షించ గా నెగెటివ్ రావడంతో ఇటీవలే వారు ఇంటికి తిరిగి వచ్చారు. అయితే మరోసారి పరీక్షించగా ఆకుటుంబంలోని చిన్నారికి పాజిటివ్ గా తేలింది. రాష్ట్రంలోని కరోనా రోగులలో అతి చిన్న వయస్కురాలని సమాచారం అయితే దానిని అధికారులు ధృవీకరించాల్సి ఉంది.

మరోవైపు మే 3 తరువాత రాష్ట్రంలో లాక్ డౌన్ తొలగించి ఆర్ధిక వ్యవస్థని గాడిలో పెట్టే ఆలోచనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉన్నట్టు సమాచారం. కరోనా ఇప్పట్లో పోయేది కాదని, ముదుసలి వారికి తప్ప మిగతా వారికి పెద్ద ప్రమాదం కాదు కాబట్టి.. దానితో కలిసి ఉండాల్సిన అవసరం ఉందని నిన్న జగన్ చెప్పుకొచ్చారు.