Research-About-The-US-Says-No-To-India's-Plan-to-Lift-The-Lockdownవిశాఖపట్నంలో నమోదు అవుతున్న కరోనా కేసుల మీద ఎప్పటినుండో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జిల్లాలో ఇప్పటివరకూ 21 కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. పన్నెండు రోజులుగా కేసులు జిల్లాలో నమోదు కాలేదు. మొన్న ఈ మధ్యనే ఒక కొత్త కేసు నమోదు అయ్యింది. దానితో లెక్క 21కి చేరింది.

కరోనా కేసులు బయటపడ్డ మొదట్లో ఎక్కువగా విశాఖలోనే కేసులు ఎక్కువగా నమోదు అయ్యాయి. ఆ తరువాత ఆగిపోయాయి. టీడీపీ వారు.. ప్రభుత్వం కావాలనే విశాఖ లో కేసులు తొక్కిపెట్టి, అదే సమయంలో అమరావతి ఉన్న గుంటూరు లో కేసులను ఎక్కువగా చూపించి రాజధానిని తరలించే ప్రయత్నం చేస్తుందని ఆరోపిస్తున్నారు.

ఇది ఇలా ఉండగా… ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఒక కథనం ఆశ్చర్యంగా ఉంది. రెండు ప్రధాన ఆసుపత్రులలో 51 మందిని ఐసొలేషన్ వార్డులలో పెట్టి సీక్రెట్ గా వైద్యం చేయిస్తున్నారని ఆ కథనంలో ఆరోపణ. ‘కాబోయే రాజధాని క్షేమం’ అని చెప్పుకోవడానికే ఈ తిప్పలు అంటూ ఆ కథనం ఆరోపిస్తుంది. మరోవైపు ప్రభుత్వం మాత్రం జిల్లాలో కేసులు ఇరవై ఒకటే అంటున్నాయి.

అందులో 19 మంది ఇప్పటికే రికవర్ కాగా…. మరో ఇద్దరు మాత్రమే ట్రీట్మెంట్ లో ఉన్నారని చెప్పుకొస్తున్నారు. ఇది ఇలా ఉండగా… ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు ఉదయం మెడికల్ బులెటిన్ ప్రకారం 813కు చేరుకున్నాయి. గడచిన 24 గంటలలో 56 కేసులు నమోదు అయిపోయాయి. కర్నూల్ లో అత్యధికంగా 208 కేసులు ఉన్నాయి.