temporary secretariat constructionఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గుంటూరు జిల్లా వెలగపూడి వద్ద జరుగుతున్న తాత్కాలిక సచివాలయ పనులను విహంగ వీక్షణం చేశారు. విజయవాడ నుంచి ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి హెలికాప్టర్ లో మంత్రి నారాయణ సమక్షంలో వెళ్లిన సీఎం చంద్రబాబు ఎల్ అండ్ టీ, షాపూర్జీ పల్లోంజి సంస్థలు శరవేగంగా పూర్తి చేస్తున్న తాత్కాలిక రాజధాని పనులను పరిశీలించారు.

తాత్కాలిక రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయని, 945 పిల్లర్లు నిర్మించాల్సి ఉండగా, ఇప్పటికే 807 పిల్లర్ల నిర్మాణం పూర్తయ్యిందని మంత్రి నారాయణ తెలిపారు. ఇంకా 138 పిల్లర్లను నిర్మించాల్సి ఉందని, మరో మూడు రోజుల్లో తాత్కాలిక రాజధాని నిర్మాణాల ఫౌండేషన్ పూర్తవుతుందని ఆయన పేర్కొన్నారు. నిర్మాణ పురోగతి పనులను సీఎంకు వివరించిన నారాయణ, జూన్ నాటికి ఏపీ తాత్కాలిక రాజధాని నిర్మాణం పూర్తవుతుందన్న హామీని ఇచ్చారు.