Vangalapudi-Anitha TDP Leaderఏపి సీఎం జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన దిశా చట్టం కానీ., దిశా స్టేషన్లు కానీ., ఇప్పుడు ప్రారంభించిన దిశా వాహనాలు కానీ ఒక దశ – దిశా లేకుండా ఉన్నాయనేది టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అనిత వ్యాఖ్యానించారు. గడిచిన మూడేళ్ళుగా మహిళల మీద జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట వేయలేని మీ దిశా చట్టం ఎవరికీ మేలు చేస్తున్నట్లు అంటూ జగన్ ను ప్రశ్నించారు.

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని., అది ఎంతలా వ్యాపించిందంటే వైసీపీ నాయకులే మహిళలపై., మహిళా ఉద్యోగులపై తమ ప్రతాపాన్ని చూపేలా ఉన్నాయంటూ ఆధారాలతో సహా వైసీపీ నేతలను ఏకిపారేశారు టిడిపి మహిళా నేతలు.

గంట వస్తావా …, అరగంట చాలు .., అని పాపులర్ అయినా వైసీపీ నేతల ఆడియో టేపులను సాక్ష్యాలుగా చూపిస్తూ ఇదేనా మహిళల పట్ల మీ పార్టీ నాయకులకు ఉన్న దిశా అంటూ రెచ్చిపోయారు అనిత. మీరు చేసిన దిశా చట్టానికి ఇంత వరకు కేంద్ర అనుమతి తీసుకురాలేకపోయారు కానీ., స్టేషన్లంటూ, వాహనాలంటూ ప్రజల సొమ్ముని ఇలా వృధా చేస్తున్నారంటూ మండిపడ్డారు ప్రతిపక్ష పార్టీలు.

రాష్ట్రంలో దిశా చట్టం కేంద్రంగా శిక్ష పడిన ఒక్క నిందితుడిని కానీ, న్యాయం జరిగిన ఒక్క ఆడబిడ్డను కానీ చూపించగలరా మీరు? చట్టం ఆధారంగా అరెస్టులు మాత్రమే జరుగుతున్నాయి. ఆ అరెస్టులు చేయడానికి దిశా చట్టంతో పని లేదు. ఇప్పుడు ఆ అరెస్ట్ చేసిన నిందితులను జైలుకు పంపడానికేనా ముఖ్యమంత్రి గారు ఈ దిశా వాహనాలు అంటూ ప్రభుత్వ తీరును ఎండగట్టారు టీడీపీ మహిళా నేతలు.