Andhra Pradesh Chief Minister YS-Jagan-Mohan-Reddyఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ‘అధికారిక కార్యక్రమాలు’ రాజకీయ విమర్శలకు వేదికవుతున్నాయి. ప్రతిపక్ష పార్టీలు సహనం కోల్పోవడం చూసాం కానీ ఇలా అధికారంలో ఉన్న పార్టీ నేతలే, అందులోను స్వయానా రాష్ట్ర అధినేత హోదాలో ఉన్న ముఖ్యమంత్రే ఇలా ప్రత్యర్థులను రెచ్చకొట్టేలా.,రాష్ట్రంలో అశాంతిని రేపెలా వ్యాఖ్యలు చేయడం ఎంత వరకు సబబు అంటూ రాజకీయ విశ్లేషకులే నోరెళ్లపెడుతున్నారు.

ప్రతిపక్ష నేతలకు బీపీలు వస్తాయని..,గుండె పోట్లు వస్తాయని..,టిక్కెట్లు తీసుకుంటారని..,జగన్ చేసిన వ్యాఖ్యలకు ఆంతర్యం ఏమిటో చెప్పాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అంటే జగన్ ప్రత్యర్థి పార్టీ నాయకులను భయపెడుతున్నారా?లేక బెదిరిస్తున్నారా? అంటూ నిలదీస్తున్నాయి విపక్షాలు. ప్రభుత్వాన్ని తప్పుపట్టిన వారందరికి మీ బాబాయ్ ‘వివేకా’ మాదిరి గుండె పోట్లు తెప్పిస్తారా? అంటూ సూటిగా ప్రశ్నిస్తున్నారు.

రాష్ట్రమంతా పాద యాత్రలు చేసి.., ప్రజలను మభ్య పెట్టి.., చేతకాని – చేయలేని హామీలిచ్చి అధికారంలోకి వచ్చి బీపీలు తెచ్చుకుంటుంది మీరు. ప్రతిపక్ష నేతల విమర్శలను తట్టుకోలేక మీకు.,మీ నాయకులకు.,బీపీలు వచ్చి పార్టీ కార్యలయాల మీద దాడులు చేసిన చరిత్ర మీది. మీ బీపీలకు గుండె పోట్లు రావా? ముఖ్యమంత్రి గారు అంటూ దుయ్యబట్టారు టీడీపీ నేతలు.

‘సభ్యత – సంస్కారం’ అనే పదాలకు అర్ధం కూడా తెలియకండా మీడియా ముందు బీపీలతో ‘బూతులు’ మాట్లాడే నేతలను పెంచి పోషిస్తున్న ‘రౌడీల పార్టీ’ వైసీపీ పార్టీ అంటూ జగన్ వ్యాఖ్యలకు అవాక్కయే కౌంటర్లు వేశారు టిడిపి నాయకులు. అధికారంలోకి వచ్చిన వ్యక్తులు హుందాగా నడుచుకోవాలి.,లేదంటే రాష్ట్రంలో లా &ఆర్డర్ సమస్యలు తలెత్తుతాయన్నారు.

వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా అప్పటి సీఎం చంద్రబాబుని నడి రోడ్డు మీద ‘ఉరి’ తీయాలి అంటూ బిపీలతో జగన్ ఉగిపోయినా, టిడిపి పార్టీ కార్యకర్తలను కూడా సంయమనంతో హుందాగా వ్యవహరించమని చంద్రబాబు చెప్పారే కానీ పార్టీ కార్యలయాల మీద దాడులకు పురికొల్పలేదు. దుర్మార్గులు., మారీచులు.,నా వెంట్రుక కూడా పీకలేరు అంటూ ఎవరిని.., ఎందుకు రెచ్చకొడుతున్నారు? ఇలా మాట్లాడి సమాజనికి ఎం సందేశం ఇస్తున్నారు అంటూ జగన్ పై విరుచుకుపడ్డారు ప్రతిపక్ష పార్టీలు.

రాజకీయ పార్టీలు ప్రభుత్వాలను స్థాపించి అభివృద్ధి కార్యక్రమాలు..,సంక్షేమ పధకాలను ప్రజలకు చేరువ చేయాలే కానీ ప్రతిపక్ష నాయకులకు ‘టికెట్’ ఇచ్చే ప్రయత్నాలు కాదు అంటూ హెచ్చరిస్తున్నారు సీనియర్ రాజకీయ నాయకులు.”బండ్లు ఓడలు – ఓడలు బండ్లు” అయినట్లుగానే “ప్రభుత్వాలు – ప్రతిపక్షాలుగా”..,”ప్రతిపక్షాలు – ప్రభుత్వాలు”గా మారిన ఉదంతానికి సాక్ష్యం గా నిలిచిన జగన్ ఇటువంటి హెచ్చరికలు చేయడం హాస్యాస్పదంగా ఉంది అంటున్నారు రాష్ట్ర ప్రజానీకం.

దేవుని దయతో., ప్రజల చల్లని దీవెనలతో అధికారంలోకి వచ్చిన మీరు., మీ ‘అధికారం’ దయతో ప్రతిపక్ష నాయకులకు టికెట్స్ ఇచ్చి., మీ ‘పాలనా రాహిత్యంతో’ ప్రజలకు వెచ్చని దీవెనలు ఇస్తున్నారంటూ టీడీపీ నాయకులు సెటైర్లతో ప్రభుత్వానికి సమాధానం ఇచ్చారు.