TDP-Leaders-Suspension and Arrestsఏపీ అసెంబ్లీలో టీడీపీ నాయకుల సస్పెన్షన్ల పర్వం ముగిసింది. సస్పెండ్ అయిన టీడీపీ నాయకులు అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో ఏపీ ఎక్సయిజ్ కమిషన్ కార్యాలయ ముట్టడికి పిలునిచ్చారు. అందులో భాగంగా విజయవాడలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ముందుగానే అప్రమత్తమైన పోలీస్ ఉన్నతాధికారులు అచ్చెన్నాయుడ్ని హౌస్ అరెస్ట్ చేశారు.

పోలీస్ అధికారుల ఆంక్షలను తొలగించుకొని అచ్చెన్నాయుడు తన తోటి సహచర ఎమ్మెల్యేలతో కలసి ప్రభుత్వ కల్తీ మద్యం అమ్మకాలకు; జగ్గారెడ్డి గూడం కల్తీ మద్యం మరణాలకు వ్యతిరేకంగా తమ నిరసన తెలపడానికి బస్సు యాత్రగా బయల్దేరారు. అలా వెళ్లిన టీడీపీ నాయకులను; కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించ్చారు సిబ్బంది.

ప్రభుత్వం సారా మరణాలను కూడా సహజ మరణాలంటూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుందని టీడీపీ నేత నిమ్మల వ్యాఖ్యానించారు. ఈ కల్తీ మద్యంలో ప్రాణాంతక రసాయనాలు ఉన్నాయంటూ నివేదికలు బయటకు వచ్చాయి. ఈ విషయమై ఎక్స్జెజ్ కమిషనర్ ను కలసి ఈ నివేదికలు సమర్పించి బయటకు వస్తామని టీడీపీ నాయకులు పోలీస్ శాఖ వారిని అభ్యర్ధించినా ఫలితం లేకపోయిందనే ఆవేదనతో ఉన్నారు తెలుగు తముళ్లు.

వైసీపీ ప్రభుత్వం నిరంకుశత్వంగా వ్యవహరిస్తుందని., త్వరలోనే మీకు., మీ పార్టీకి ప్రజలు తగిన బుద్ది చెప్తారని టీడీపీ సీనియర్ లీడర్ అచ్చెన్న ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు కూడా ప్రతిపక్ష పార్టీలకు లేదా? అంటూ ప్రశ్నించారు గద్దె రామ్మోహన్.

మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు మీకు; మీ అధినేతకు సెక్యూరిటీ కలిపించారు కాబట్టే జగన్ ప్రజాయాత్రల పేరుతో రాష్ట్రమంతా స్వేచ్ఛగా తిరగ గలిగారని తెలిపారు టీడీపీ ఎమ్మెల్యేలు. ఇటువంటి నీచ రాజకీయాలనే భవిషత్ లో రానున్న ప్రభుత్వాలు తలమానికంగా తీసుకుంటే ఈ వైసీపీ నేతల పరిస్థితి ఏమిటో ఓ సారి ఆలోచించుకోవాలంటూ సలహాలిస్తున్నారు టీడీపీ నేతలు.