andhra pradesh curent situationఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపోయి ఇప్పటికి ఏడున్నరేళ్ళు అవుతుంది. రాజధాని లేకుండా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ కు ఇప్పటికీ రాజధాని లేదు సరి కదా రాజధాని ఏదీ అంటే చెప్పలేని పరిస్థితి. కనీసం ఆర్టీఐ అప్లికేషన్లో కూడా దానికి సమాధానం దొరకదు.

రాష్ట్రం ఏర్పడిన తొలి ఐదేళ్ల కాలంలో రాజధాని అని, పెట్టుబడులని, సదస్సులని ఏదో ఒక హడావిడి ఉండేది. అయితే అధికార మార్పిడి కారణంగా మొత్తం పరిస్థితులు మారిపోయాయి. పెట్టుబడుల ఊసు అనేది ఎప్పుడూ లేదు.

అంతర్జాతీయ సదస్సులకు పొరుగున ఉన్న తెలంగాణకు ఆహ్వానాలు వస్తాయి. ఆంధ్రప్రదేశ్ కు మాత్రం ఆ అవకాశమే ఉండదు. పెట్టుబడుల గురించి కేంద్రం రాష్ట్రాల లిస్టు విడుదల చేస్తే చివరలో ఈశాన్య రాష్ట్రాలతో పోటీ పడే పరిస్థితి.

ఇక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ ఏంట్రా అంటే మటన్ షాపులు, సినిమా టిక్కెట్లు. 100 కోట్ల ఆదాయం కూడా రాని సినిమా పరిశ్రమ గురించి మంత్రులు గంటల పాటు రివ్యూ మీటింగులు, ప్రెస్ మీట్లు.

పరిస్థితి ఎంత దారుణమంటే… మంత్రి గారు మీడియా ముందు వచ్చి సినిమాల కలెక్షన్లు చెబుతారు. ఆ సినిమా ఇంత చేసింది ఈ సినిమా అంత చేసింది అంటూ క్రాస్ రోడ్స్ లో సినిమా ఫ్యాన్స్ లాగా నంబర్లు ఇస్తారు. అసలు రెండున్నరేళ్లలో ఎంత మార్పు?

యాభై శాతం ప్రజలు ఒక ఉద్యమంగా ఓట్లు వేసి చరిత్రలో ఎన్నడూ లేని విజయాన్ని అందించింది ఇందు కోసమేనా?