Is-This-Jagan-Strategy-in-Not-Taking-TDP-MLAsప్రత్యేక హోదా తేవడం చంద్రబాబుకు చేత కాలేదు… నేను వస్తే కేంద్రం మెడలు వంచి తేవడం ఖాయమని చెప్పి అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గద్దె నెక్కిన వెంటనే చేతులు ఎత్తేశారు. మోడీని సర్ ప్లీజ్ సర్ ప్లీజ్ అని బ్రతిమాలటం తప్ప వేరే మార్గం లేదు ఎందుకంటే వారికి ఇప్పుడు పూర్తి మెజారిటీ ఉంది కాబట్టి అని చెప్పుకొస్తున్నారు. అదేదో చంద్రబాబు నాయుడు టైం లో మోడీకి పూర్తి మెజారిటీ లేనట్టు!! దీనిపై విమర్శలు వస్తున్నా జగన్ బేల మాటలు మానడం లేదు.

తాజగా ఒక జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ…. మోడీ మనసు కరిగించమని దేవుడిని ప్రార్ధించడం తప్ప నేను చెయ్యగలిగింది ఏమీ లేదని చెప్పారు జగన్. దీనిపై సోషల్ మీడియా లో జోకులు పండుతున్నాయి. “జగన్ ఢిల్లీకి ఎందుకు వెళ్లినట్టు? బ్రదర్ అనిల్ కుమార్ వద్దకు స్వామీ స్వరూపానంద్ర దగ్గరకు వెళ్లి మోడీ మనసు మార్చడానికి ప్రార్ధనో యాగామో చేయించుకోవచ్చు కదా,” అని కొందరు. అందుకేనా ఈ మధ్య జగన్ గుళ్లకు చర్చిలకు మసీదులకు తిరుగుతున్నాడని ఇంకొందరు.

ఇదేనా పోరాటం అని మరికొందరు హేళన చేస్తున్నారు. అయితే చంద్రబాబు ఓటమి నుండి తేరుకోకముందే ప్రత్యేక హోదా అనే అంశాన్ని ప్రజలలో పలచన చెయ్యాలి అనేది జగన్ వ్యూహంగా కనిపిస్తుంది. ముందు నుండీ నా వల్ల కాదు అంటున్నాడు కాబట్టి ప్రజలకు కూడా పెద్దగా అంచనాలు భ్రమలు ఉండవు. దీనితో ప్రతిపక్షాలను పట్టించుకునే వాడు ఉండడు అని ముఖ్యమంత్రి వ్యూహం కావొచ్చు. ఏది ఏమైనా ప్రత్యేక హోదా అనేది ఇక ముగిసిన అధ్యయం అని మనం అనుకోవాల్సిందే.