survey Karnataka elections not favour to bjpకేంద్ర ఆర్ధిక శాఖ చేసినట్టుగా చెబుతున్న కొన్ని వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరంగా ఉన్నవి. హోదాకు బదులుగా ఇంతకుముందు ప్రకటించిన ప్యాకేజీకి మాత్రమే తాము పరిమితమని, మిగిలినవి ఇవ్వడం సాధ్యం కాదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ వర్గాలు స్పష్టం చేశాయని సమాచారం. ఇదే సమయంలో కొన్ని రాజకీయ వ్యాఖ్యలను కూడా కేంద్రం చేసినట్టుగా టీవీ ఛానళ్ళు చెబుతున్నాయి.

తెలుగు సానుభూతి అంటూ రాజకీయ వేడిని పెంచుకుని ఏపీ నేతలు సతమతమవుతున్నారని వ్యాఖ్యానించింది ఇప్పుడు తెలుగు సెంటిమెంట్ అంటున్నారని, అలా అనుకుంటే రేపు తమిళం, మలయాళం కూడా అలానే అంటాయని ఢిల్లీ వర్గాలు అన్నట్టు సమాచారం. ఇప్పుడేమీ యుద్ధాలు జరగడంలేదు కదా.. రక్షణ శాఖకు అన్ని నిధులు ఎందుకని అడిగినా అడుగుతారని ఆర్థికశాఖ ఘాటుగా వ్యాఖ్యానించింది.

సైన్యానికి కేటాయించిన నిధులు కూడా ఏపీకి కేటాయించాలని డిమాండ్‌ చేసినా చేస్తారని ఆర్థిక శాఖ అధికారులు వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ఇదే సంధర్భంగా ఈ నాలుగేళ్లలో పోలవరం, రెవెన్యూలోటు సహా పలు పద్దుల కింద రూ.12500 కోట్లు రాష్ట్రానికి ఇచ్చినా రాష్ట్రం నుంచి ఒక్క రూపాయికి కూడా లెక్కలు చూపలేదని కేంద్ర ఆర్థికశాఖ అధికారులు అంటున్నారు.

అయితే ఈ ఆరోపణ కూడా రాజకీయంగా ప్రేరేపితమైందిగా కనిపిస్తుంది. రెవిన్యూ లోటుగా ఇచ్చిన డబ్బుకు లెక్క చూపించాలని రూల్ ఎక్కడా లేదు. రాష్ట్రం అది తన అవసరాలకు వాడుకోవచ్చు. పోలవరంకు విడుదల చేసిన డబ్బు బిల్లులు రాష్ట్రం తన డబ్బుతో చెల్లించాకే కేంద్రం ఇస్తుంది. అప్పుడు దానికి లెక్కలు లేకపోవడం ఉండదు. ఈ రెండు పద్దులకే సింహభాగం నిధులు వెళ్లాయి. ఇంకా లెక్కలు లేవు అనడం రాజకీయ విమర్శ అనే అనుకోవాలా?