Supreme-Court-Raps-the-Center-for-Non-Implementation-of-Bifurcation-Promisesవిభజన హామీల విషయంలో సుప్రీం కోర్టులో కేంద్రం మరో అఫిడవిట్‌ దాఖలు చేసింది. కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌ దాఖలు చేసిన పిటిషన్‌కు కౌంటర్లు ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని అద్దం పడుతున్నాయి. ఇప్పటికే అంతకుముందు దాఖలు కేంద్రం చేసిన అఫిడవిట్‌లో ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే జోన్‌, తెలంగాణలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ సాధ్యం కావని కేంద్ర హోంశాఖ అభిప్రాయపడిన సంగతి తెలిసిందే.

తాజాగా జాతీయ స్థాయి విద్యాసంస్థల ఏర్పాటుపై కేంద్ర మానవ వనురుల శాఖ తాజా అఫిడవిట్‌ సుప్రీం కోర్టుకు సమర్పించింది. కేంద్రీయ విశ్వవిద్యాలయం పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయాల్సి ఉందని తన అఫిడవిట్‌లో పేర్కొంది. రెండు రాష్ట్రాల్లో గిరిజన విశ్వవిద్యాలయాలు ఏర్పాటు పరిశీలనలో ఉన్నట్లు పేర్కొంది.

వీటితో పాటు మిగతా విద్యాసంస్థల ఏర్పాటు, తరగుతల నిర్వహణ వంటి అంశాలపై వివరణ ఇచ్చింది. కేంద్రం వేస్తున్న అఫిడవిట్లు ప్రత్యర్థి టీడీపీ పార్టీ చేతిలో ఆయుధాలుగా తయారవుతున్నాయి. దీనితో బీజేపీ నాయకుల పరిస్థితి అటూ ఇటూ కాకుండా ఉంది. సాక్షాతూ సుప్రీం కోర్టులో కేంద్రమే వేస్తున్న అఫిడవిట్లను సమర్ధించలేక ఆ పార్టీ నేతలు అవస్థ పడుతున్నారు.