Amit Shah - Narendra Modi - political Strategy in Telanganaకేంద్రంలో టీడీపీ మిత్రపక్ష ప్రభుత్వం ఉన్నా పెద్దగా ఉపయోగం ఉన్నట్టు కనిపించడం లేదు. ఆంధ్రప్రదేశ్ మీదకంటే తెలంగాణ మీదే ఎక్కువ ప్రేమ ఉన్నట్టుగా ఉంది కేంద్రానికి. దీనికి తాజా ఉదాహరణ రెండు రాష్ట్రాలు పంపిన రిజర్వేషన్ బిల్లులు. ఏపీ ప్రభుత్వం కాపు కోటా బిల్లును ఆమోదించకముందే తెలంగాణ ప్రభుత్వం రేజర్వేషన్ల బిలు కేంద్రానికి పంపింది.

గిరిజనుల కోటాను 6 నుంచి 9 శాతానికి, ముస్లిం కోటాను 4 నుంచి 12 శాతానికి పెంచాలని అసెంబ్లీలో బిల్లును ఆమోదించింది. తెలంగాణలో ఆ రెండు వర్గాల జనాభా అధికంగా ఉన్నందున… కోటాను పెంచాలని కోరింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ కాపుల రిజర్వేషన్ బిల్లును వెంటనే కొట్టిపడేసిన కేంద్రం తెలంగాణ విషయంలో మాత్రం నిదానంగా వ్యవహరిస్తోంది.

తెలంగాణ బిల్లుపై కేంద్రం ఇప్పటిదాకా స్పందించలేదు. ఏపీ పంపిన కాపు రేజర్వేషన్ల బిల్లును మాత్రం ‘నిలిపి వేయాలి’ అని ఆగమేఘాల మీద తేల్చేయడం టీడీపీకి మింగుడుపడని అంశం. మరోవైపు కాపు నేత ముద్రగడ పద్మనాభం మార్చి 31 లోగా రేజర్వేషన్లు అమలులోకి తీసుకుని రాకపోతే మరింత కఠినంగా ఉద్యమాన్ని నడిపించనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.