Pawan-Kalyan-Announces-Jana-Sena-First-Plenary-Date2019 ఎన్నికలు సమీపిస్తున్నాయి. రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకుంటుంది. ఒకవైపు జగన్ పాదయాత్రతో ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తుంటే ఇంకో వైపు పవన్ కళ్యాణ్ సుడిగాలి పర్యటనలు చేసి జనసేనకు మద్దతు కూడగడుతున్నారు. అయితే ఎన్నికల సమయంలో పొత్తులు ఎలా ఉండబోతున్నాయి అనేది ఆసక్తికరమైన విషయం.

టీడీపీ గత ఎన్నికలలో బీజేపీతో కలిసి పోటీ చేసింది. అయితే వారి ప్రయాణం సరిగ్గా సాగడంలేదు అనేది అందరికి తెలిసిన విషయమే. టీడీపీ బీజేపీని వదిలి బయటకి రావాలని టీడీపీ అభిమానులే కోరుకుంటున్నారు. అయితే చంద్రబాబు మైండ్లో ఏముందో ఎవరికీ తెలీదు. విశ్వసనీయ వర్గాల కధనం బట్టి చంద్రబాబు జనసేన వైపు చూస్తున్నారని సమాచారం.

జనసేన తో కలిసి పోటీ చేసి వారికి ఒక 30-35 సీట్లు ఇవ్వొచ్చని చెబుతున్నారు. అటువంటి సమయంలో బీజేపీతో పొత్తు ఉండకపోవచ్చు. జనసేనకు అన్ని సీట్లు ఇచ్చాక టీడీపీ బీజేపీకి సీట్లు ఇవ్వడం కష్టం. అదే సమయంలో బీజేపీ కూడా అయోమయంలో ఉంది. టీడీపీతో విడాకులు తీసుకోవాలని కొందరు నాయకులు భావిస్తున్న సొంత బలంపై ఆ పార్టీ వారికే నమ్మకం లేదు.

ఒకదశలో అవసరమైతే జగన్ తో కలవాలని అనుకున్న నంధ్యాల ఉపఎన్నిక తరువాత ఆ విషయంగా పునరాలోచిస్తున్నారు. అయితే టీడీపీ జనసేన కలిసిపోటీ చేస్తే బీజేపీ వైకాపాతో కలవకతప్పదు. ఒకరకంగా చెప్పాలంటే 2019లో ఉండబోయే పొత్తులు అన్ని దాదాపుగా చంద్రబాబు నాయుడు నిర్ణయంపైనే ఆధారపడనున్నాయి.