AP NGO President Bandi Srinivasa Rao23 శాతం ఫిట్ మెంట్ ఇచ్చినందుకు గానూ, రిటైర్మెంట్ వయసును మరో రెండేళ్ల పాటు పెంచినందుకు గానూ, డీఏలను ఒకేసారి పేమెంట్ చేస్తామని చెప్పినందుకు గానూ ఏపీ సర్కార్ పై ఉద్యోగ సంఘ నేత బండి శ్రీనివాసరావు మిక్కిలి హర్షం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

ఇక్కడివరకు బాగానే ఉంది, కానీ గత టిడిపి ప్రభుత్వం దిగిపోవడానికి కారణం ప్రభుత్వ ఉద్యోగులని, తాము కన్నెర్ర చేయడం కారణంగానే నాటి చంద్రబాబు సర్కార్ పఠనం అయ్యిందని, అలాగే తాము సహకరించడం వలనే జగన్ సర్కార్ కు 151 సీట్లు వచ్చాయని సంతోషంతో వ్యాఖ్యానించారు.

అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటుంది. అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు. నేడు జగన్ ప్రభుత్వం ఉండి ఉండవచ్చు, రేపు చంద్రబాబో లేక ఇంకో పార్టీనో అధికారం దక్కించుకోవచ్చు. అప్పుడు ప్రభుత్వ ఉద్యోగి అయిన బండి, ఈ రాజకీయపు మాటలకు ఎలా సంజాయిషీ ఇచ్చుకుంటారు?

ఇదంతా పక్కన పెడితే, నిజంగా వచ్చే ఎన్నికలలో జగన్ ఓటమి పాలయితే, అప్పుడు కూడా బండి ఇలానే సమాధానం చెప్తారా? టిడిపి సర్కార్ ను ఓడించింది, జగన్ కు 151 సీట్లు తెప్పించింది తామేనన్న బండి, వైసీపీ ఓటమికి, టిడిపి గెలుపుకు తామే కారణం అని చెప్పుకోగలరా?

అలా చెప్పి ధైర్యంగా నిలబడగలరా? ఊహానిజతమే అయినా, నేడు చంద్రబాబుపై చేసిన విమర్శలన్నీ మళ్ళీ జగన్ పై చేయగలుగుతారా? అసలే ఎముక లేని చేయి.., అందులోనూ ఓ గొప్ప మానవతావాది… ఉదారస్వభావం కలిగిన జగన్ ఈ విమర్శలన్నీ ఉపేక్షిస్తారా?