Botsa-Satyanarayana- AP Education Ministerకొత్త మంత్రి వర్గ కూర్పును ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పూర్తి చేసారు. ఇందులో భాగంగా అంతకుముందు విధులు నిర్వహించిన మంత్రిత్వ శాఖలో కూడా పలు మార్పులు చేసారు. అందులో ప్రధానమైన మార్పు… సీనియర్ రాజకీయ నేత అయినటువంటి బొత్స సత్యనారాయణదే.

తొలి మూడేళ్ల పాటు మునిసిపల్ శాఖ విధులు నిర్వహించిన బొత్సకు, ఈ దఫా విద్యా శాఖను నిర్వహించే బాధ్యతలను జగన్ మోహన్ రెడ్డి అప్పగించారు. అంటే ఇక నుండి ఆంధ్రప్రదేశ్ లో విద్య వెలుగొందాలంటే, అది సీనియర్ రాజకీయ నేత అయిన బొత్స నోటి వెంట వినాల్సిందే.

అంతకుముందే నెటిజన్లు మేల్కొని, గతంలో బొత్స సత్యనారాయణ గారు ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూని పోస్ట్ చేస్తూ… “మన కొత్త ఎడ్యుకేషన్ మినిస్టర్” అంటూ గుర్తు చేస్తున్నారు. నాడు ఎప్పుడో బొత్స పలికిన పలుకులు నేడు విద్యా శాఖా మంత్రి అయిన పిదప సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ట్విట్టర్ లో ఈ వీడియోకు వస్తోన్న స్పందన మాములుగా లేదు. నెటిజన్లు మరియు తెలుగు తమ్ముళ్లు ఈ వీడియోకు ఇస్తోన్న రిప్లైలు మరియు మేమ్స్ తో విద్యాశాఖ మంత్రిగా బొత్స పాపులారిటీ మరింతగా పెరుగుతోంది. భవిష్యత్తులో ఇలాంటి ఉపన్యాసాలు వినడానికి ఏపీ విద్యార్థులంతా చెవులు పెకలించి మరీ సిద్ధంగా ఉండాలి!