andhra-pradesh-nellore-elections-narayanaనెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ కంచుకోట. గత ఎన్నికలలో ఆ పార్టీ ఇక్కడ ఉన్న 10 సీట్లలో ఏకంగా ఏడు సీట్లు సాధించింది. అయితే ఈ సారి నెల్లూరు జిల్లాను తెలుగుదేశం పార్టీ సీరియస్ గా తీసుకుంది. మరీ ముఖ్యంగా నెల్లూరు రురల్, అర్బన్ పై దృష్టి పెట్టారు. నెల్లూరు సిటీ లో ఏకంగా మంత్రి నారాయణను రంగంలోకి దింపారు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ వైఎస్సార్ కాంగ్రెస్ తరపున దూకుడుగా ఉండే నేత. అనేక సార్లు తెలుగుదేశం ప్రభుత్వం నోరు పారేసుకుంటూ ఉంటారు.

గత ఎన్నికలలో ఆయన ఏకంగా 19000 మెజారిటీతో గెలిచారు. దీనితో ఆయనను ఓడించాలని చంద్రబాబు నుండి కింద స్థాయి క్యాడర్ వరకు కృత నిశ్చయంతో ఉన్నారు. నారాయణకు నెల్లూరులో స్థానికంగా అంగబలం, అర్ధబలం ఉండటంతో టీడీపీ గట్టి పోటీ ఇవ్వనుందని విశ్లేషకుల అభిప్రాయం. ఇటీవలే పవన్ కళ్యాణ్ నెల్లూరు వచ్చి అనిల్ మీద విరుచుకుపడ్డారు. అలాగే అధికారంలోకి వచ్చాక ప్రత్యర్ధులను నరకడమే, చంపడమే అన్న ఒక్క వీడియో బయటకు వచ్చి ఆయన ఇమేజ్ ను డామేజ్ చేసాయి.

ప్రస్తుతం నారాయణ, ఆయన కుటుంబ సభ్యులు ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. నారాయణ భార్య రమాదేవి కూడా ప్రచారంలో చురుగ్గా పాల్గొని ఓట్లు అభ్యర్థిస్తున్నారు. అయితే అనిల్ ఏమీ తక్కువేమి కాదు. ఒక వైపు ప్రజలకు అందుబాటులో ఉంటూ.. మరోవైపు పార్టీ కేడర్‌ను సమన్వయంతో నడిపిస్తూ స్థానికంగా తన బలాన్ని మరింత పెంచుకున్నారు. దీనితో నెల్లూరు సిటీలో ఈ సారి ఆసక్తికరమైన పోరు నడవబోతుంది. మొట్టమొదటి సారిగా ఎన్నికలలో పోటీ చేస్తున్న నారాయణ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెడతారో లేదో చూడాలి.