andhra pradesh muncipal and panchayati elctions 2020ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. మూడు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తెలిపారు. మొదటి దశలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయన్నారు. 660 జెడ్పీటీసీ, 9639 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయని తెలిపారు.

రెండో దశలో పంచాయతీ ఎన్నికలు, మూడో దశలో మున్సిపాలిటీలకు ఎన్నికలు ఉంటాయని ఆయన చెప్పారు. ఎన్నికల నియమావళి తక్షణమే అమలులోకి వస్తుందని ఆయన అన్నారు. మరోవైపు ఇప్పటికే రిజర్వేషన్లపై ప్రతిపక్ష టీడీపీ పార్టీ సుప్రీం కోర్టుకు వెళ్లడంతో… కోర్టు ఏమైనా ఈ ప్రక్రియకు అడ్డు చెబుతాదేమో చూడాలి.

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూల్‌:
మార్చి 7: నోటిఫికేషన్‌ విడుదల.
మార్చి 9-11: నామినేషన్ల స్వీకరణ.
మార్చి 12: నామినేషన్ల పరిశీలన.
మార్చి 14: నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది.
మార్చి 21: ఎన్నికల పోలింగ్‌.
మార్చి 24: ఓట్ల లెక్కింపు.

మున్సిపల్‌ ఎన్నికల షెడ్యూల్‌:
మార్చి 9: నోటిఫికేషన్‌ విడుదల.
మార్చి 11-13: నామినేషన్ల స్వీకరణ.
మార్చి 14: నామినేషన్ల పరిశీలన.
మార్చి 16: నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది.
మార్చి 23: ఎన్నికల పోలింగ్‌.
మార్చి 27: ఓట్ల లెక్కింపు.

పంచాయతీ ఎన్నికల తొలి విడత షెడ్యూల్‌:
మార్చి 15: నోటిఫికేషన్‌ విడుదల.
మార్చి 17-19: నామినేషన్ల స్వీకరణ.
మార్చి 20: నామినేషన్ల పరిశీలన.
మార్చి 22: నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది.
మార్చి 27: ఎన్నికల పోలింగ్‌.
మార్చి 27: ఓట్ల లెక్కింపు.

పంచాయతీ ఎన్నికల రెండో విడత షెడ్యూల్‌:
మార్చి 17: నోటిఫికేషన్‌ విడుదల.
మార్చి 19-21: నామినేషన్ల స్వీకరణ.
మార్చి 22: నామినేషన్ల పరిశీలన.
మార్చి 24: నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది.
మార్చి 29: ఎన్నికల పోలింగ్‌.
మార్చి 29: ఓట్ల లెక్కింపు.