Andhra Pradesh Legislative council - -మండలిలోని తమ ఆధిక్యతతో టీడీపీ రాజధాని మార్పునకు సంబంధించిన రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపించింది. అయితే తమను శాసించడం నచ్చని అధికార పక్షం ఏకంగా మండలినే రద్దు చెయ్యాలంటూ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. ఇప్పుడు మండలి ఎప్పుడు రద్దు అవుతుంది అనేది కేంద్రం చేతిలో ఉంది.

ఇది అలా ఉండగా సెలెక్టు కమిటిని అడ్డుకోవడానికి వైఎస్సార్ కాంగ్రెస్ శతవిధాలా ప్రయత్నిస్తుంది. కమిటీలకు సభ్యులను ప్రతిపాదించడానికి ఈరోజే ఆఖరు రోజు. అయితే ఛైర్మన్ నిబంధనలకు పాటించలేదు అని చెబుతూ వైఎస్సార్ కాంగ్రెస్ కమిటీలకు సభ్యులను ప్రతిపాదించలేదు.

మరోవైపు… ఆయా కమిటీల్లో ఉండాల్సిన నేతల జాబితాను పార్టీలు పంపించాయి. తెదేపా, భాజపా, పీడీఎఫ్ నుంచి మండలి ఛైర్మన్ కార్యాలయానికి ఈ జాబితాలు చేరాయి. ఒక్కో కమిటీలో తెదేపా నుంచి ఐదుగురు.. భాజపా, పీడీఎఫ్ నుంచి ఒక్కొక్కరికి మండలి ఛైర్మన్ అవకాశం కల్పించారు.

దానికి అనుగుణంగా మూడు రాజధానులు, సీఆర్ డీఏ ఉపసంహరణ బిల్లులకు ఆయా పార్టీలు పేర్లను పంపాయి. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు లేకుండా కమిటిలను ఏర్పాటు చేసే అవకాశాలపై ఛైర్మన్ రాజ్యాంగ నిపుణులతో చర్చిస్తున్నారు. అటువంటి అవకాశం ఉంటే… ఆ స్దానలలో మిగతా పార్టీల వారికి అవకాశం ఇవ్వవచ్చు.