Image result for kapu casesఉద్యమాల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసులను ఎత్తివేస్తూ ఏపీ ప్రభుత్వం మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పుడు ఇది వివాదంగా మారింది. ఈ మేరకు హోంశాఖ కార్యదర్శి కేఆర్‌ఎం కిశోర్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. 2016 జనవరిలో తుని, తూర్పుగోదావరి జిల్లాలో కాపు ఉద్యమం నేపథ్యంలో నమోదైన కేసులను ఎత్తివేస్తున్నట్టు తెలిపారు.

కాపు ఉద్యమం సమయంలో కొందరు అరాచక శక్తులు చొరబడి రత్నాచల్ ఎక్సప్రెస్ కు నిప్పు పెట్టిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన కేసులు ఎత్తివేసి, కేంద్రం పెట్టిన కేసులు ఎత్తివేయడానికి సిఫార్సు చెయ్యాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదే సమయంలో గుంటూరు, అనంతపురం సహా వివిధ ప్రాంతాల్లో రిలయన్స్ ఆస్తుల ధ్వంసం కేసులను ఎత్తివేసున్నామని ప్రభుత్వం ప్రకటించింది.

2010లో వైఎస్ మరణానికి రిలయన్స్ కారణం అంటూ ఒక చిన్న బ్లాగ్ లో రాసిన వార్తకు రాష్ట్రవ్యాప్తంగా జగన్ మద్దతుదారులు రిలయన్స్ ఆస్తులను ధ్వంసం చేసారు. అయితే టీడీపీ మాత్రం ఇది సొంత వారిని రక్షించుకోవడానికి చేసిన చర్యగా అభివర్ణిస్తుంది.

2010లో జగన్ కు అనుకూలంగా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒత్తిడి చెయ్యడానికి జగన్ దాడులు చేయించారని వారి ఆరోపణ. అలాగే 2015లో చంద్రబాబు ప్రభుత్వాన్ని అస్థిరపర్చడానికి కాపు ఉద్యమంలో అరాచక శక్తులను ప్రవేశ పెట్టి జగన్ అరాచకం సృష్టించారని టీడీపీ అంటుంది.