YS-Jagan-Mohan-Reddy will loose 2 percent Votesరాజకీయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పడం కష్టం. ఈ రోజు తమ ఓటర్లు అనుకున్నవారు సడన్ గా వ్యతిరేకం కావొచ్చు. అలా జరగకపోతే 2012 ఉప ఎన్నికలలో కనీవినీ ఎరుగని రీతిలో గెలిచిన జగన్, 2014 నాటికి ఎందుకు ఓడిపోతారు? ఇక పోతే ప్రభుత్వ ఉద్యోగులకు చంద్రబాబుకు ఎందుకనో పోసగదు అని మనం చాలా తరచుగా వింటూ ఉంటాం.

తాము రెండు చేతులతో ఓట్లు వేసి మరీ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గెలిపించామని వారు మొన్నా మధ్య చెప్పుకున్నారు కూడా. అందుకని వారు ఎక్కడకు పోతారు అనుకున్నారేమో, జగన్ కు మొదటి నుండీ ఉద్యోగులంటే అలుసే. ప్రతి నెలా వారికి జీతాలు, పింఛనుల కోసం ఎదురుచూపులే.

తాజాగా పీఆర్సీ విషయంలో ప్రభుత్వం మరింత దారుణంగా వ్యవహరించింది. తమకు చూపించి చర్చించిన నివేదిక ఒకటి, అమలు పరచింది ఇంకోటి అని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. పీఆర్సీ వస్తే జీతాలు పెరగకపోగా ఒక్కో ఉద్యోగికి నాలుగు వేలు తగ్గుతుందట. మున్ముందు ఈ నష్టం ఇంకా ఎక్కువ ఉంటుందని ఉద్యోగులు అంటున్నారు.

ఉద్యోగులను ఏమార్చేందుకు ఇచ్చిన రిటైర్మెంట్ పెంపు వల్ల “అన్న వస్తే జాబులు వస్తాయి… జాబు క్యాలెండర్ వస్తుందని” వేచిచూసిన నిరుద్యోగులు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకం అవుతున్నారు. జగన్ స్వయంగా తెచ్చిన సచివాలయ వ్యవస్థలోని ఉద్యోగులు కూడా ఆనందంగా లేరు. ఈ వర్గాలు… వారి కుటుంబాలను లెక్కిస్తే ఒకేసారి జగన్ 2% ఓట్లు కోల్పోయినట్టే అని విశ్లేషకుల అంచనా.

ఈ రెండు శాతానికి… సహజంగా వచ్చే ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా కోల్పోయే ఓట్లు కలుపుకుంటే జగన్ ప్రభుత్వం డేంజర్ జోన్ లో పడినట్టే.