What Is the Credibility, Mr. IYR Krishna Raoవిభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు అప్పట్లో ప్రభుత్వంలో చాలా కీలకంగా ఉండే వారు. తరువాత ఆయన సేవలను మెచ్చి రిటైర్ అయ్యాకా బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు చంద్రబాబు. ఏమైందో ఏమో గానీ ప్రభుత్వం ఇచ్చిన నామినేటెడ్ పదవిని అనుభవిస్తూనే ఆయన ఫేస్ బుక్ లో ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు, జగన్ అనుకూల వ్యాఖ్యలు చేసేవారు.

అది గుర్తించి ప్రభుత్వం ఆయనను తప్పించింది. ఆ తరువాత ఆయన మరింతగా ప్రభుత్వాన్ని ఎటాక్ చెయ్యడం మొదలు పెట్టారు. ఇటీవలే పవన్ కళ్యాణ్ ఆయనను నిజనిర్ధారణ కమిటీలో కూడా పెట్టారు. అయితే తాజాగా తేలింది ఏమిటంటే ఐవైఆర్ కృష్ణారావు ఇంకో ప్రభుత్వ నామినేటెడ్ పదవిలో ఉంటూనే ఇవన్నీ చేస్తున్నారంట.

తాజాగా ఉద్యోగుల వేల్పేర్ ఫండ్ చైర్మన్ పదవి నుంచి కూడా తొలగించారు. చంద్రబాబు ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ఆయన ఆరోపిస్తున్నారు. అయితే కృష్ణారావే ముందుగా రాజీనామా చేసి అటువంటి విమర్శలు చేసి ఉంటే బావుండేది కదా? అదే నైతికత కూడా కదా!