Andhra Pradesh High Court - YS Jaganఎట్టిపరిస్థితులలోనూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల ప్రధాన అధికారిగా ఉండగా స్థానిక ఎన్నికలకు వెళ్లకూడదని భీష్మించుకుని కూర్చుంది ఆంధ్రప్రదేశ్ అధికార పక్షం. ఆయన టీడీపీ మనిషి అని తమ అంగబలం అర్ధబలం తో ఎక్కువ శాతం సీట్లు గెలవనివ్వకుండా చేస్తాడని వారి ఆందోళన. దానితో కరోనా సాకుతో ఎన్నికలకు వెళ్లకుండా ఉండే ప్రయత్నం చేస్తుంది.

అయితే దానికి హై కోర్టు ఒప్పుకోలేదు. వచ్చే ఫిబ్రవరిలో ఎన్నికలు జరపాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని తాము అమలు చెయ్యలేమని, ఇది ఎన్నికల కమిషన్ ప్రభుత్వం తో సంప్రదించకుండా తీసుకున్న ఏకపక్ష నిర్ణయమని ఏపీ ప్రభుత్వం హైకోర్టులో వాదించింది.

ప్రజారోగ్యాన్ని, అధికారుల భద్రతని తాము పణంగా పెట్టలేమని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఎన్నికల కమిషన్ సన్నాహాలపై స్టే ఇవ్వాలని… ప్రస్తుతం ఉన్న పరిస్థితినే కొనసాగించాలని కోర్టుని అభ్యర్ధించింది. అయితే ఇందుకు కోర్టు ఒప్పుకోలేదు. ఎన్నికల నిర్వహణ అనేది పూర్తిగా ఎన్నికల కమిషన్ నిర్ణయం అని కోర్టు మరోసారి తేల్చి చెప్పింది.

ఎన్నికల నిర్వహణ ఇటీవలే సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులు తమ ముందు ఉంచాలని ఆదేశించింది. దీనితో అధికారపక్షం నిరాశకు గురయ్యింది. అసెంబ్లీలో ఉన్న సీఎం దీనిపై మంత్రులతో, అధికారులతో చర్చించి సుప్రీం కోర్టుని అవసరమైతే ఆశ్రయించాలని సీఎం భావిస్తున్నారని పలు వర్గాలు చెబుతున్నాయి.