Andhra Pradesh High Court - YS Jaganమూడు రాజధానుల చట్టం, రాజదాని సంస్థ రద్దు చట్టాలపై ఉన్న స్టాటస్ కో ని ఎపి హైకోర్టు పొడిగించింది.వచ్చే నెల ఇరవై ఒకటివరకు దీనిని పొడిగిస్తూ ,అప్పటి నుంచి రోజువారీ విచారణ చేపడతామని హైకోర్టు తెలిపినట్లు సమాచారం వచ్చింది. ఈ చట్టాల పై వచ్చిన పిటిషన్ లను హైకోర్టు విచారణ జరిపింది.

సెప్టెంబర్ 11 నాటికి ఎపి ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని, ఆ తర్వాత పిటిషనర్లు 17నాటికి జవాబు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.సెప్టెంబర్ 21 కి విచారణ వాయిదా పడింది. ఇదే సమయంలో ప్రభుత్వానికి కొంత ఊరటనిస్తూ… సెప్టెంబర్ 21 నుండి రోజూ వారీగా ఈ కేసు విచారణ చేపడతామని కోర్టు తెలిపింది.

రోజూ వారీ విచారణతో ఈ కేసు త్వరగా తేలి మూడు రాజధానులు మార్గం సుగమం అవుతుందని జగన్ ప్రభుత్వం భావిస్తుంది. అయితే దీనికి కూడా వైఎస్సార్ కాంగ్రెస్ సమర్ధకులు హ్యాపీ ఫీల్ కావడం లేదు. ఇటువంటి క్లిష్టమైన కేసులు కూడా ఒక్క సిట్టింగ్ లో పూర్తి అయిపోయి తమకు అనుకూలమైన తీర్పు రావాలని వారు కోరుకోవడం గమనార్హం.

“జగన్ కేసులు వాయిదా పడితే కోర్టులు బాగా పని చేస్తున్నట్టు అప్పుడు అందరూ హ్యాపీ… అమరావతి విషయంలో వాయిదాలు వేస్తే ఎక్కడ లేని బాధ… కోర్టులు చంద్రబాబు కన్నుసన్నలలో పని చేస్తున్నాయని ఆరోపణలు.. జగన్ కేసు వాయిదాలు ఆపేసి తీర్పు ఇవ్వమని చెప్పండి అప్పుడు మీ నిబద్దత నిరూపించుకోండి,” అంటూ టీడీపీ వారు విమర్శిస్తున్నారు.