YS Jagan blames courtsఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి న్యాయవ్యవస్థ మీద పోరాటం మొదలుపెట్టారు. హై కోర్టు న్యాయమూర్తులు… కాబోయే సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ విషయంపై ఇప్పటి ప్రధాన న్యాయమూర్తి ఏం చెయ్యబోతున్నారు అనేదాని మీద క్లారిటీ లేదు.

కానీ ఉన్నఫళంగా ఏపీ హైకోర్టు ప్రభుత్వానికి సహకరిస్తుందా? అనే కొత్త వాదన తెరమీదకు వస్తుంది. నిన్న తిరుమలలో క్రైస్తవుడైన ముఖ్యమంత్రి డిక్లరేషన్ ఇవ్వకుండా స్వామి వారిని దర్శించుకోవడంపై వేసిన ఒక పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. ముఖ్యమంత్రి జగన్ క్రైస్తవుడు అనడానికి రుజువు ఏంటి అని కోర్టు ప్రశ్నించడం విశేషం.

ఆ విషయం అందరికీ తెలిసిందే అయినా కోర్టు రుజువు కావలనడం విశేషం. మరోవైపు… ఈరోజు అమరావతిలోని అస్సైన్డ్ భూముల కుంభకోణంలో తుళ్లూరు మాజీ తహశీల్దార్ పై వచ్చిన ఆరోపణల మీద సిఐడి దర్యాప్తునకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం. దర్యాప్తును ప్రాథమిక దశలోనే అడ్డుకోవడం, స్టే ఇవ్వడం లాంటివి చేయరాదని సుప్రీంకోర్టు పలుమార్లు స్పష్టంగా చెప్పిందని తాజా తీర్పులో పేర్కొంది హైకోర్టు.

సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ అన్నె సుధీర్‌బాబు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. గతంలో ఇటువంటి కేసులోనే మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ కు హైకోర్టులో రిలీఫ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇక జగన్ ప్రభుత్వానికి సహకరించనుందా? అనే చర్చ జరుగుతుందా?