andhra-pradesh-high-court-unhappy-with-ysrcp-party-colors-for-government-buildingsఇటీవలే జరిగిన ఎన్నికలలో ఘనవిజయం సాధించిన వైఎస్సార్ కాంగ్రెస్ చెట్టునూ పుట్టనూ కూడా వదలకుండా తమ పార్టీ రంగులు వేసేస్తుంది. అయితే ఇప్పుడు హైకోర్టులో జగన్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులు వేయడంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం, పల్లపాడు పంచాయతీ కార్యాలయానికి వైసీపీ రంగులు వేయడంపై దాఖలైన పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిపిన న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు ఎలా వేశారంటూ ప్రశ్నించింది. పది రోజుల్లో నివేదిక ఇవ్వాలని గుంటూరు జిల్లా కలెక్టర్‌ను హైకోర్టు ఆదేశించింది.

ఒకవేళ ఈ కేసులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వస్తే మాత్రం అది రాష్ట్రం మొత్తం మీద ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వం అవి పార్టీ రంగులు కాదని కోర్టు ముందు వాదించే అవకాశం ఉంది. అటువంటి సందర్భంలో ఏం జరుగుతుంది అనేది న్యాయమూర్తి విచక్షణాధికారం మీద ఆధారపడి ఉంటుంది.

“గతంలో ఇటువంటివి కోర్టు దాకా వెళ్ళలేదు. ఒకవేళ పార్టీ రంగులు వేశారని కోర్టు అభిప్రాయపడితే ఆ రంగులు వెయ్యడానికి అయ్యే ఖర్చు ప్లస్ ఆ రంగులు ఇప్పుడు తీయడానికి అయ్యే ఖర్చు వైఎస్సార్ కాంగ్రెస్ ఖాతా నుండి చెల్లించాల్సిందిగా కోర్టు ఆదేశించవచ్చు,” అని ఒక రాజకీయ విశ్లేషకుడు అభిప్రాయపడ్డారు.