Andhra Pradesh High Court Waters Down The Hopes of Andhra Pradesh Governmentఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హై కోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. ఏపీలోని పంచాయతీ కార్యాలయాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాను పోలిన రంగులు తొలగించాలని హైకోర్టు ఆదేశించింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశాల్లో పేర్కొంది.

అందుకు ప్రభుత్వం 3 వారాల గడువు కోరింది. దీనికి అంగీకరించని ధర్మాసనం ఈ మేరకు గడువిచ్చింది. పంచాయతీ కార్యాలయాల రంగులు తీసేయాలని, ప్రభుత్వ కార్యాలయాలకు ఏ పార్టీతో సంబంధం లేని రంగులేయాలని హైకోర్టు ఇదివరకే తీర్పు ఇచ్చింది. తీర్పు అమలుకు మరికొంత గడువు కావాలని ప్రభుత్వం హైకోర్టులో అనుబంధ పిటిషన్ దాఖలు చేసింది.

ప్రభుత్వ యంత్రాంగం అంతా కరోనా నివారణ చర్యలలో మునిగివుందని, మూడు నెలల సమయం కావాలని కోరింది. దీనిపై ఉన్నత న్యాయస్థానం తాజాగా విచారణ చేపట్టింది. రంగులు తొలగించేందుకు ప్రభుత్వానికి 3 వారాల గడువిచ్చింది. గతంలో ఈ రంగులు వెయ్యడానికి ప్రభుత్వం 1300 కోట్లు ఖర్చుపెట్టింది.

మూడు నెలల గడువు ఇస్తే ఆలోగా ఎన్నికలు కూడా పూర్తి చెయ్యొచ్చని… ఆ విధంగా ఆ రంగులతో ఏవైనా లబ్ది కలిగే అవకాశం ఉంటే కలుగుతుందని అధికార పార్టీ ఆలోచన అంటూ రాజకీయ విశ్లేషకులు ప్రభుత్వ పిటిషన్ ను విశ్లేషించారు. అయితే హైకోర్టు అందుకు ఒప్పుకోకపోవడంతో కథ అడ్డం తిరిగింది. అదీ కాక ఇప్పుడు రంగులు మార్చడానికి తడిసిమోపెడు అవుతుంది.