Andhra-Pradesh-High Court-Nimmagadda Ramesh Kumar-YS Jaganఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హై కోర్టులో మరోసారి చుక్కెదురు అయ్యింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్ ‌కుమార్‌‌ను కొనసాగించాల్సిందేనని ఉన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఆయనను తొలగిస్తూ జగన్ సర్కార్ ఇచ్చిన ఆర్డినెన్స్‌‌ను హైకోర్టు కొట్టేసింది. నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించింది.

ఆర్టికల్ 213 ప్రకారం ఆర్డినెన్స్ తెచ్చే అధికారం ప్రభుత్వానికి లేదని ధర్మాసనం తేల్చిచెప్పింది. హైకోర్టు తీర్పుతో ప్రస్తుతం కమిషనర్ కనగరాజ్ పదవి నుంచి తొలగినట్టేనని నిపుణులు తెలిపారు. తీర్పు వచ్చిన వెంటనే తాను ఛార్జ్ తీసుకున్నట్టు రమేష్ కుమార్ ప్రకటించారు. అయితే ఈ విషయంగా సుప్రీం తలుపు తట్టాలని జగన్ ఆలోచన చేస్తున్నట్టు సమాచారం.

అయితే న్యాయ నిపుణులు మాత్రం అటువంటి ప్రయత్నాలు మార్చుకుంటే మంచిదని అంటున్నారు. రాజకీయ విశ్లేషకులు మాత్రం జగన్ కమ్మ కులం మీద ఇప్పటికైనా అక్కసు తగ్గించుకుంటే మేలు అని సలహా ఇస్తున్నారు. “తన కింద పని చేసే ఒకరిద్దరు కమ్మలు తప్ప మిగతా అందరినీ చంద్రబాబు తొత్తులుగా చూస్తున్నారు జగన్. రమేష్ కుమార్ ఆ కులానికి సంబంధించిన వారు కాకపోతే ఖచ్చితంగా ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఈ ఆలోచనా సరళి మారకపోతే ఆయనకే ప్రమాదం,” అని వారు సలహా ఇస్తున్నారు.

“రాష్ట్రంలోని అన్ని కులాల వారు సమానంగా ఓట్లు వేస్తేనే జగన్ అద్వితీయమైన మెజారిటీతో గెలిచారు. అయితే అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఒక కులాన్ని పూర్తిగా దోషులను చేసే ప్రయత్నం జరుగుతుంది. జగన్ అట్టి వారి మీద కక్షసాధింపుకు దిగుతున్నారు. అయితే అధికారం ఉన్న మాత్రానా అన్ని చెల్లవు అనే దానికి ఉదాహరణ ఈ తీర్పు. ఇప్పటికైనా ఆ కమ్మ ఫోబియా తగ్గించుకుంటే ఆయనకే మంచిది,” అని వారు చెబుతున్నారు. అయితే 151 సీట్లు, 51% ఓటు బ్యాంకు మత్తులో అటువంటి సలహాలు తలకెక్కుతాయా అనేది చూడాలి