Andhra Pradesh -High Court - Kommineni Srinivasసీనియర్ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావు గత కొన్ని సంవత్సరాలుగా జగన్ కు వీర మద్దతుదారుగా నిలిచారు. పొద్దునే వచ్చే తన పాపులర్ టాక్ షోలో అప్పటి టీడీపీ ప్రభుత్వాన్ని బాగా ఇరుకున పెట్టి ప్రతిపక్షం ఎజెండాను బుజాల మీద మోసేవారు. అయితే ఆ తరువాతి కాలంలో ఎన్టీవీ ఆయనను తప్పించగా అది టీడీపీ ప్రభుత్వం కుట్ర ఆయన ఆరోపించారు.

అయితే జగన్ ఆయనను వెంటనే అక్కున చేర్చుకుని సాక్షిలో అదే స్థాయి పదవి, అదే టైమింగ్ లో టాక్ షో స్లాట్ ఇచ్చారు జగన్. జగన్ సొంత ఛానల్ లో నౌకరీ కావడంతో ఇక కొమ్మినేని మరింత చెలరేగిపోయారు. సాక్షి డిబేట్లకు టీడీపీ వారు రాకపోవడంతో కొమ్మినేనికు అడ్డుఅదుపు లేదు. నాదే రాజ్యం అన్నట్టు చెలరేగే ఆయనకు తాజాగా ఒక గట్టి షాక్ తగిలింది.

సీనియర్ జర్నలిస్టయినా తన విచక్షణ మర్చిపోయి వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులుగా న్యాయవ్యవస్థకు దురుదేశాలు ఆపాదిస్తూ హై కోర్టు తీర్పులనే తప్పు పట్టారు. జడ్జిలను చంద్రబాబు ప్రభావితం చేస్తున్నారు అంటూ వ్యాఖ్యలు చేసారు. అందుకు ప్రతిగా హై కోర్టు నోటీసులు అందుకున్నారు.

కొమ్మినేని తో పాటు నలభై మంది వైఎస్సార్ కాంగ్రెస్ సమర్ధకులకు కూడా నోటీసులు వచ్చాయి. దశాబ్దాల అనుభవం అని చెప్పుకునే జర్నలిస్టుకు ఊరు పేరు లేని సోషల్ మీడియా వ్యక్తులకు తేడా లేదని అనిపించేలా ఈ ఉదంతం ఉండడం కొమ్మినేని అనుభవానికే మచ్చ అని చెబితే కాదని చెప్పలేని పరిస్థితి.