Andhra Pradesh High Court కరోనా కారణంగా తమ జీతాలు, పెన్షన్లలో కొత్త విధించడం రాజ్యాంగబద్ధం కాదని కొందరు విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగులు హై కోర్టును ఆశ్రయించారు. దీనిని విచారించిన కోర్టు రెండు నెలలలో ఉద్యోగులకు కట్ చెయ్యబడిన జీతాలు పెన్షన్లు.. 12% వడ్డీతో వారికి చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆశ్రయించింది.

జగన్ ప్రభుత్వానికి కోర్టులలో వ్యతిరేక తీర్పులు రావడం కొత్తేమీ కాకపోయినా ఈ సారి అధికార పార్టీ హై కోర్టుకె ఝలక్ ఇవ్వాలని చూడటం గమనార్హం. ఇందులో భాగంగా తమకు అనుకూల ఉద్యోగ సంఘాలతో హై కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా లేఖ రాయించారు. మాకు సామాజిక బాధ్యత ఉండకూడదా? మేము ప్రభుత్వానికి సహకరించకూడదా? అంటూ కోర్టు తీర్పు పై విరుచుకుపడి సంఘాలు తమ స్వామి భక్తిని చాటుకున్నాయి.

ఏకంగా మాకు ఆఫీసులకు రాని కాలం (లాక్ డౌన్) లో కూడా జీతాలు చెల్లించి ప్రభుత్వం ఉదారత చాటుకుంది. హై కోర్టు తీర్పు మీద అప్పీల్ కు వెళ్తాము అంటూ ప్రకటించడం గమనార్హం. ఇది ప్రభుత్వాన్ని హీరోని చేసి హై కోర్టుని విలన్ గా చిత్రికరించే ప్రయత్నంగా కొందరు చూస్తున్నారు. కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.

“రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధిక ఇబ్బందులలో ఉంటే ఆదుకునే బాధ్యత ప్రజల మీద ఉంటుంది. అయితే ఓటు బ్యాంకు రాజకీయాలకు అప్పులు చేసినప్పుడు కాదు. అదే లాక్ డౌన్ సమయంలో అనేక ఓటు బ్యాంకు కార్యక్రమాలు చేసి జీతాల వరకే ఆర్ధిక ఇబ్బందులు, సామాజిక బాధ్యత అంటే ఎలా,” అని కొందరు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.