Andhra-Pradesh-Gudivada-Developmentఏయ్ బిడ్డా… గుడివాడ నా అడ్డా… అంటూ ఎప్పుడూ భీకర స్వరంతో ప్రత్యర్థులపై విరుచుకుపడే కొడాలి నాని నియోజకవర్గంలో సంక్రాంతి పండగ హంగామా మీడియా వర్గాల్లో చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. గోవాని తలపించే విధంగా ఉన్న ఈ విజువల్స్ చూసి అందరూ ఒక్కసారిగా నోరెళ్ళ బెట్టారు.

ఈ సెట్స్ కు వేసిన డెకరేషన్ చూస్తే చాలు… ఈ పార్టీ వెనుక ఎవరి హస్తం ఉందో తెలియడానికి! దీనిపై ఎవరూ ఇంకా స్పందించలేదు గానీ, ఒకవేళ స్పందిస్తే సదరు నేత ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో అన్న విషయం మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

గోవా వెళ్లి పార్టీ చేసుకోలేని పేద వారి కోసం స్థానికంగా గోవా సదుపాయాలు కల్పిస్తే నేరమా? అని సదరు నేత ఎదురు ప్రశ్నిస్తారనేది నెటిజన్ల మాట. అలాగే మీ పిల్లలు ఇతర విదేశాలకు వెళ్లి జల్సా చేయొచ్చు గానీ, గుడివాడలో పండగ సరదా తీర్చుకుంటే నేరమా? అని అడిగినా అడుగుతారనేది వైరల్ అవుతోన్న డైలాగ్స్.

ఏది ఏమైనా గతంలో ఎన్నడూ లేని విధంగా ఏర్పాటైన కృష్ణాజిల్లాలోని గుడివాడ సంక్రాంతి పండగకు హాట్ టాపిక్ అయ్యింది. గుడివాడలో అభివృద్ధికి ఇదే నిదర్శనం అని భావించాలా? రాష్ట్రమంతా చర్చించుకునే విధంగా నియోజక వర్గాన్ని తీర్చిదిద్దిన ఘనత సదరు ఎమ్మెల్యే గారు సొంతం చేసుకున్నారా?