Andhra-Pradesh-govt-employees-suryanarayana-meets-governorఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఓ నోటీస్ జారీ చేసింది. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వంతో చర్చించే అవకాశం ఉండగా, ఏపీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ నేతృత్వంలో ఉద్యోగ సంఘం నేతలు రాజ్‌భవన్‌కి వెళ్ళి గవర్నర్‌ బిశ్వాభూషన్ హరిచందన్‌ని ఎందుకు కలిశారో వివరణ ఇవ్వాలని ఆ నోటీసులు కోరింది. రోసా నిబందనలకి విరుద్దంగా ఉద్యోగ సంఘాల నేతలు గవర్నర్‌ని కలిసినందున మీ సంఘం గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదో వారం రోజులలోపు లిఖితపూర్వకంగా సంజాయిషీ ఇవ్వాని ఆ నోటీసులో పేర్కొంది.

గత గురువారం సూర్యనారాయణ నేతృత్వంలో ఉద్యోగ సంఘం నేతలు గవర్నర్‌ని కలిసి తన జీతాల చెల్లింపు, డీఏ బకాయిలు తదితర అంశాల గురించి వినతిపత్రం ఇచ్చారు. ఊహించిన్నట్లే దానిపై గవర్నర్‌ ఎటువంటి చర్యలు తీసుకోలేదు కానీ ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు తప్పు పట్టారు. “త్వరలోనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి సూర్యనారాయణ అధ్యక్షత వహిస్తున్న సంఘానికి గుర్తింపు రద్దు చేయమని కోరుతాము,” అని అన్నారు.

మరి ఆయనే ప్రభుత్వాన్ని కోరారో లేదా ఆయన ఇచ్చిన ఈ ఐడియాతో రాష్ట్ర ప్రభుత్వమే స్పందించి నోటీస్ పంపిందో తెలీదు కానీ ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి ఇప్పుడు పెద్ద చికొచ్చి పడిందని చెప్పవచ్చు. తమ సమస్యలపై పోరాటం మొదలుపెట్టడానికి సిద్దమైనప్పుడు వారి సంఘానికి గుర్తింపు రద్దు చేస్తే, వారికి ఆ అవకాశమే లేకుండాపోతుంది.

కానీ లక్షలాదిమంది సభ్యులుగా ఉన్న ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుర్తింపు రద్దు చేయడం అంత తేలికైన విషయం కాదు. అది తేనె తుట్టెని కదిపిన్నట్లే అవుతుంది కనుక ప్రభుత్వం కూడా తొందరపడకపోవచ్చు. ఎలాగూ ఉద్యోగ సంఘాల నేతల మద్య ఆధిపత్యపోరు కొనసాగుతోంది కనుక సంఘం గుర్తింపు రద్దు చేయకూడదనుకొంటే సూర్యానారాయణతో సహా ప్రభుత్వానికి ఇబ్బంది కలిగిస్తున్నవారినందరినీ ఉద్యోగ సంఘం పదవులలో నుంచి తొలగించాలని ప్రభుత్వం షరతు విదిస్తుందేమో? AP