High Court of Andhra Pradeshఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం న్యాయవ్యవస్థ పై దాడి కొనసాగిస్తుంది. మొన్నటికి మొన్న హై కోర్టు న్యాయమూర్తుల మీద తీవ్ర ఆరోపణలు చేస్తూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కి లేఖ రాసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ దాడిని ఏకంగా హై కోర్టులోనే కొనసాగించింది రాష్ట్ర ప్రభుత్వం. సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ రాకేష్ కుమార్ పై తీవ్రమైన విమర్శలు చేస్తూ ఎపి ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది.

ఆయన ఆయా కేసులలో ముందస్తుగానే ఒక అభిప్రాయానికి వస్తున్నారని ప్రభుత్వం అభిప్రాయపడింది. రాజ్యాంగ విచ్చిన్నం అంటూ అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని ప్రభుత్వం వ్యాఖ్యానించింది. మిషన్‌ బిల్డ్‌ ఆంధ్ర ప్రదేశ్‌లో భాగంగా సర్కారు ఆస్తులను వేలం ద్వారా విక్రయించేందుకు వీలుగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖ లైన వ్యాజ్యాల్లో విచారణ నుంచి ఆయన తప్పుకుంటే గానీ తమకు న్యాయం పొందే అవకాశం ఉండదని హైకోర్టుకు తెలిపింది.

పక్షపాతంతో వ్యవహరించేందుకు ఆస్కారం ఉందని సహేతుక ఆందోళన ఉన్నప్పుడు, కేసు విచారణ నుంచి తప్పుకోండని కోరవచ్చంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం తన అఫి డవిట్‌లో ప్రస్తావించింది.కోర్టులలో సదరు న్యాయమూర్తి చేస్తున్న వ్యాఖ్యలు కొద్ది గంటలకే సోషల్‌ మీడియా, ఎలక్ట్రానిక్‌ మీడియా,పత్రికల ద్వారా అవి దావానలంలా వ్యాపించి ప్రభుత్వం పరువు తీస్తున్నాయని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది.

మరోవైపు ఏపీ ప్రభుత్వం ఒత్తిడి కారణంగానే ఏపీ హై కోర్టు ప్రధాన న్యాయమూర్తిని బదిలీ చేశారని వార్తలు వస్తున్న తరుణంలో మరో న్యాయమూర్తిని టార్గెట్ చెయ్యడం తమకు సహకరించకపోతే మీకు ఇబ్బందులు తప్పవు అన్నట్టు మెస్సేజ్ పంపినట్టు అయ్యిందని… ఈ వ్యవహారం ముందు ముందు దేనికి దారి తీస్తుందో చూడాలి.