Andhra-Pradesh-Government-School-Mergingవైసీపీ ప్రభుత్వ రివర్స్ అధ్యాయంలో సువర్ణాక్షరాలతో లిఖించవలసినది పాఠశాలల విలీనం. అది పాఠశాలల విలీనం కాదని తరగతుల విలీనమని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణవారు గట్టిగా సమర్దించుకొన్నారు. నాడు-నేడు పేరుతో వందల కోట్లు ఖర్చు చేసి ముస్తాబు చేసిన అనేక పాఠశాలలకు తాళాలు ఎందుకు వేశారు? వాటినేమి చేస్తారు? ప్రభుత్వ పాఠశాలలను ఉద్దరించడానికి ఇంత ఖర్చు చేసి పేద విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాలలలో 25 శాతం సీట్లు కేటాయించాలని ప్రభుత్వం ఎందుకు హుకుం జారీ చేసింది? అనే ప్రశ్నలకు జవాబులు ఉండవు.

వైసీపీ ప్రభుత్వం తీసుకొన్న ఈ (రివర్స్) నిర్ణయాలకు ఫలితాలు కనబడేందుకు కొంత సమయం పడుతుందని  బొత్సవారు సెలవిచ్చారు. కానీ ఈ విద్యా సంవత్సరం ఆరంభంలోనే అప్పుడే దాని ఫలితాలు కనిపిస్తున్నాయి. ప్రాధమిక తరగతులలో చేరే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఉదాహరణకు మంత్రివర్యుల సొంత జిల్లా విజయనగరంలోనే ఓ పాఠశాలలో 1,2 తరగతులు కలిపి మొత్తం 8 మంది విద్యార్థులే చేరారు.

ప్రతీ పాఠశాలలో ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరపడం ఆనవాయితీ కనుక అక్కడా జరిపారు. దానిలో పాల్గొన్న విద్యార్థులు 8 మంది అయితే, ఉపాధ్యాయులు, గ్రామస్తులు, ముఖ్య అతిధి కలిపి సుమారు 30 మంది అయ్యారు. ఈ ఫోటోయే ఇందుకు సాక్ష్యం.

కనుక రివర్స్ విద్యావిధానంలో ఫలితాలు కళ్ళకు కట్టినట్లు అప్పుడే కనబడుతున్నాయి. ఇక విద్యాసంవత్సరం పూర్తయ్యి పరీక్షలు నిర్వహిస్తే ఎలాగూ ఈ రివర్స్ ప్రయోగ ఫలితాలు పూర్తిగా కనబడకమానవు. అయితే అప్పుడు 8-10 మంది విద్యార్థులతో పాఠశాల నడపడంగిట్టుబాటుకాదని అటువంటి పాఠశాలలను కూడా మూసేవేయొచ్చు.