andhra pradesh government power cutsరాష్ట్రంలో వేసవి ‘తాపానికి’ తోడు ఈ కరెంట్ ‘కోతల’ ఉక్కపోతలతో ప్రజలు అల్లాడుతున్నారు. రాష్ట్ర ప్రజల సమస్యల పరిష్కారానికి దారులు వెతకకుండా వైసీపీ నాయకులు.,ముఖ్యమంత్రి జగన్ ప్రతిపక్షాల మీద ఆరోపణలు చేస్తూ కాలయాపన చేస్తున్నారనే భావన నానాటికి ప్రజలలో బలంగా నాటుకుంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

భానుడి ‘భగభగ’లను మించి జగన్ ‘చిటపటలు’ రాష్ట్రంలో రాజకీయ వేడిని పుట్టిస్తున్నాయి. పెరిగిన విద్యుత్ చార్జీలతో ప్రజలు అల్లాడుతుంటే., అందుకు ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న నిరసన కార్యక్రమాలతో., విమర్శల దాడులతో.,జగన్ అల్లాడుతున్నారంటున్నారు. పరిశ్రమలకు పవర్ హాలిడేలు ప్రకటించేంతవరకు పరిస్థితి వెళ్లిందంటే రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం ఏ దుస్థితికి వెళ్లిందో అంటూ విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి.

రాష్ట్ర విభజనతో తెలంగాణ అంధకారంలోకి వెళుతుందని అప్పటి ముఖ్యంమత్రి ‘కిరణ్ కుమార్ రెడ్డి’ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీకి వచ్చాయంటున్నారు రాష్ట్ర ప్రజానికం. ఈ పాపం ఎవరిది.,ముందు చూపు లేకుండా.,రాష్ట్ర ప్రజల అవసరాలను గుర్తించక పాలకులు తీసుకునే అనాలోచిత నిర్ణయాలకు శిక్షలేమో ప్రజలు అనుభవించాలి.,దూషణలు ప్రతిపక్షాలు మోయాలా ?అంటూ పరిశ్రమల యజమానులు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.

ఒక పక్క కరోనాతో ఆర్ధికంగా చితికిపోయి., మరో పక్క ప్రభుత్వ ఆలోచన లేమితో చిన్న తరహా పరిశ్రమలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇలా పవర్ హాలిడేతో వారంలో ఒక రోజు పరిశ్రమ ఆపితే అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టిన మా పరిస్థితి ఏమిటంటూ..,ఆ ఒత్తిడి తట్టుకోలేక మాకు ‘బీపీలు’ వస్తే…,మా కుటుంబాలకు ప్రభుత్వమే సమాధానం చెప్పాలంటూ పరిశ్రమల యజమానులు వైసీపీ నేతల పై ఒత్తిడి పెంచుతున్నారు.

ప్రభుత్వ ఆస్తులను తాకట్టులు పెట్టి ., దొరికిన ప్రతి చోట అప్పులు తెచ్చి రాష్ట్రంలో ఎం అభివృద్ధి చేశారో చెప్పాలంటూ విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఎన్ని రోజులు ఇలా అప్పులతో రాష్ట్ర అర్ధిక వ్యవస్థను నడుపుతారు..,ఆదాయమార్గాల పై ద్రుష్టి పెట్టారా..? విద్యుత్ కోతల నివారణకు చర్యలు తీసుకోరా? ప్రతిపక్షాల పై నిందలు మోపడం ఆపరా? అంటూ టీడీపీ నేతలు ప్రశ్నల వర్షాన్ని కురిపిస్తున్నారు.

ఒక్కో ప్రాంతంలో ఒక్కో ‘బటన్ ‘నొక్కడానికి తెస్తున్న అప్పులకు బాధ్యత ఎవరిదీ..? సంక్షేమ ఫలాలు అందుకునేది ఒక వర్గం ప్రజలే కానీ దాని తాలూకా పెరిగిన నిత్యావసరాల భారాన్ని మోయాల్సింది అందరు .రాజకీయ నాయకులు ఇలా “ఓట్ల రాజకీయాలు” చేస్తున్నంత కాలం రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న అప్పులకు బలయిపోయేది మాత్రం సామాన్య మధ్య తరగతి ప్రజలే.

“సంక్షేమం కోసం సంక్షోభాలు” సృష్టించకూడదు. ప్రజలతో ఓట్ల రాజకీయాలు చేయడానికి రాష్ట్రానికి అప్పుల భారాన్ని పెంచకూడదు. ప్రభుత్వంలోకి వచ్చాక ప్రతిపక్షాల మీద నెపం నెట్టి చేతులు దులుపుకోకూడదు. అభివృద్ధికి కులాలను అడ్డుగా చూపకూడదు. రాజకీయ అవసరాల కోసం ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టకూడదు.,ఇలా ప్రభుత్వాలు కొన్ని నైతిక సూత్రాలను పాటించక పొతే రాష్ట్రం ‘అప్పులలో’..,ప్రజలు ‘ఆవేదనలో’ మునిగిపోతారు.

ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాం కదా., మనకు అత్యధిక మెజారిటీ ఉంది కదా.,అప్పులు చేస్తాం.,ఆస్తులను విధ్వంసం చేస్తాం., అనుకుని రాజకీయాలు చేస్తే ఆ అధికారం.,మెజారిటీ., మీకు అందించిన ప్రజలే అన్ని “పీ”కి పక్కన కూర్చో పెడతారనే విషయం అన్ని రాజకీయ పార్టీలు., అందరి రాజకీయ నాయకులకు వర్తిస్తుంది అంటున్నారు పొలిటికల్ ఎనలిస్టులు.