Andhra Pradesh Government debt 3.89 lakh crore is in 8th place overall indiaఒక గీతని చిన్నదిగా చేయాలంటే దాని పక్కన మరికొంచెం పెద్ద గీస్తే సరిపోతుందన్నట్లు వైసీపీ ప్రభుత్వం ఎడాపెడా చేస్తున్న అప్పులను తగ్గించి చూపుకోవడానికి ఇతర రాష్ట్రాల అప్పులను చూపుకొనే అవకాశం లభించింది. రాజ్యసభలో తెలంగాణ ఎంపీలు రాష్ట్రాల అప్పుల వివరాలు తెలియజేయాలంటూ అడిగిన ఓ ప్రశ్నకి కేంద్ర ఆర్ధికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.

దాని ప్రకారం వివిద రాష్ట్రాల అప్పులు:

ఇప్పుడు ఈ అప్పుల గురించి మరికాస్త లోతుగా పరిశీలిస్తే, మొదటి ఏడు స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు దశాబ్ధాల క్రితం ఏర్పాటయ్యాయి. కనుక ఇన్ని దశాబ్ధాల తర్వాత వాటి అప్పులు ఈ స్థాయిలో ఉండటం సహజమే. కానీ ఏపీ, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పడి కేవలం ఎనిమిదిన్నర ఏళ్ళే అయ్యింది. ఇంత తక్కువ సమయంలో రెండు తెలుగు రాష్ట్రాలు పోటాపోటీగా అప్పులు చేస్తున్నాయి.

అయితే తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అప్పులతో ప్రాజెక్టులు నిర్మిస్తోంది. ఫ్లైఓవర్లు నిర్మిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా మౌలికవసతులు కల్పిస్తోంది. ఐ‌టి పార్కులు, హబ్బులు ఏర్పాటుచేసి వాటిలో ఐ‌టి కంపెనీలను ఏర్పాటు చేసి ఉద్యోగాలు, సంపద సృష్టించుకొంటోంది. కనుక అభివృద్ధి కోసమే తెలంగాణ ప్రభుత్వం అప్పులు చేస్తోంది గనుక దానిని తప్పు పట్టలేము.

కానీ గత మూడున్నరేళ్ళలో ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధికి బ్రేకులు వేసినట్లు నిలిచిపోయింది. అందుకు ఉదాహరణలుగా అమరావతి, పోలవరం, గుంతలు పడిన రోడ్లు కళ్లెదుటే ఉన్నాయి. కానీ వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వం అప్పులు చేసి తెచ్చిన లక్షల కోట్లను సంక్షేమ పధకాల పేరుతో ఓటర్లకి పంచిపెట్టేస్తోంది. పైగా రూ.3.50 లక్షల కోట్లు ప్రజలకి పంచి పెట్టేశామని గర్వంగా చెప్పుకొంటోంది కూడా!

కానీ తదుపరి విడత సొమ్ము కోసం లబ్ధిదారులందరూ ఆతృతగా ఎదురుచూస్తుండటం గమనిస్తే ప్రభుత్వం అప్పులు తెచ్చి పంచిపెడుతున్న సొమ్ముతో వారి జీవితాలలో ఏ మార్పు రాలేదని స్పష్టం అవుతోంది. అంటే చేసిన అప్పు అంతా ఎట్లో పిసికిన చింతపండే అని అర్దమవుతోంది.

వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ఈ అప్పులతో ఆంధ్రప్రదేశ్‌ ఏమాత్రం అభివృద్ధి చెందనప్పటికీ, అన్ని విదాల అభివృద్ధి చెంది అప్పులలో ఏడో స్థానంలో నిలిచిన గుజరాత్‌ రాష్ట్రానికి సరిసమానంగా నిలుస్తోందని పైనున్న జాబితా చూస్తే స్పష్టం అవుతోంది. అయితే ఏపీ కంటే మరో ఏడు రాష్ట్రాల అప్పులు ఎక్కువగా ఉన్నందున మనం భుజాలు చరుచుకోవలసిందే అని వైసీపీ ప్రభుత్వం చెపుతుందేమో?