Andhra Pradesh Employees comments on ys jagan kissingఆ పాదయాత్రలో పెట్టిన ముద్దులు మన సీపీఎస్ ఉద్యోగులు ఇంకా మరిచిపోలేదు. ముద్దులు గుర్తులు ఉన్నాయా, ఇప్పుడు గుద్దులు గుద్దుతున్నావా? మనం కూడా గుద్దుదామా? 19లో గుద్దామ్, 24లో కూడా గుద్దుదామా? అంటూ ఏపీజేఈఏ అధ్యక్షులు సూర్యనారాయణ చేసిన ప్రసంగం చూపరులను ఆకట్టుకుంటోంది.

కాంట్రాక్టు ఎంప్లాయిస్ రెగ్యులరైజషన్ విషయంలో సమాన పనికి సమాన వేతనం. ఇక లేటెస్ట్ గా ముద్దుల వర్షంలో లేని వాళ్ళు, చివరగా వచ్చిన మరొకళ్ళు మన ఆర్టీసీ కార్మికులు. మరొక ముద్దు ఆర్టీసీ విలీనం, మరొక గుద్దు వాళ్లకున్న పెన్షన్ హుష్ కాకి, వాళ్లకు అంతకుముందు వాళ్ళ డబ్బులతో చేసుకున్న వైద్య సదుపాయం హుష్ కాకి.

ముద్దు ముద్దుకు ఒక గుద్దుతో నేడు చవిచూస్తున్న పరిస్థితులలో… కొత్తగా మానస పుత్రిక గ్రామ సచివాలయ వాలంటరీ వ్యవస్థను తీసుకురావడం దగా కాదా? మోసం కాదా? వివిధ ప్రభుత్వ శాఖలలో నిర్వహించే పౌర సేవలను వాటి నుండి తప్పించి మానస పుత్రికకు అప్పచెప్పడం మోసం కాదా?

ఎవరినీ వదిలిపెట్టకుండా అందరికీ సమన్యాయం చేసి ఈక్వల్ గా గుండు గొరిగి, మనందరం ఈ రోజున రోడ్డుకు మీదకు తీసుకువచ్చే పరిస్థితిని ఈ ప్రభుత్వం కల్పించిందని విమర్శల వర్షం కురిపించారు. పాదయాత్రలో పెట్టిన ముద్దులకు – అధికారంలో వచ్చాక ఇస్తోన్న గుద్దులకు ఉన్న వ్యత్యాసాన్ని వివరిస్తూ చేసిన ఈ ప్రసంగం నెట్టింట వైరల్ అవుతోంది.