Kia-Motors-Andhra-Pradesh--AP's-Big-Achievement-Not-Big-for-Celebsఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల తంతు పూర్తి అయ్యింది. ఎన్నో వివాదాల మధ్య ఎన్నికలు పూర్తి అయినప్పటికీ ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. అవి భద్రంగా స్ట్రాంగ్ రూంలకు చేరాయి. మే 23నే అవి తెర్చుకుని ప్రజాతీర్పును బయటపెడతాయి. ఓటర్ల తీర్పు ఎలా ఉంది అనే దాని మీద అందరికీ ఆసక్తి ఉంది. రాజకీయ పార్టీలు, కొందరు రాజకీయ నాయకులూ ఇప్పటికే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే దాని మీద సర్వేలు చేయించుకున్నాయి. అనుకూలంగా వస్తే మురిసిపోవడం, వ్యతిరేకంగా ఉంటే లోలోపలే కుంగిపోవడం మాములే.

అయితే ఆంధ్రప్రదేశ్ కు విభజన తరువాత వచ్చిన అతిపెద్ద పెట్టుబడి కియా మోటార్స్ కూడా ఒక సర్వే చేయించినట్టు వార్తలు వస్తున్నాయి. కియా మోటార్స్ ఆంధ్రప్రదేశ్ కు వచ్చిన నాటి నుండీ భూసేకరణ నుండి ట్రయల్ కార్ వరకూ ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ వ్యతిరేకిస్తూనే వచ్చింది. రెండు మూడు నెలల ముందు కియా మోటార్స్ ఎదురుగా ఆ పార్టీ నిరసన కూడా తెలిపింది. ఇప్పుడు జగన్ గనుక అధికారంలోకి వస్తే తమను ఇబ్బంది పెడతారేమో అనే అనుమానం ఆ కంపెనీలో ఉందంట.

దీనితో తామే ఒక సంస్థ ద్వారా సర్వే చేయించుకున్నట్టు సమాచారం. ఆ సర్వే తమకు అనుకూలంగానే వచ్చిందని అనంతపురం జిల్లాకు చెందిన కొందరు తెలుగుదేశం నాయకులు చెబుతున్నారు. కియా మోటార్స్ భారతదేశ ప్రతినిధి ఒక ఆయన చంద్రబాబుకు స్వయంగా ఫోన్ చేసి ఈ విషయం చెప్పినట్టు వారు అంటున్నారు. 13 వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటవుతున్న కియ కార్ల పరిశ్రమలో 11 వేల మందికి ఉద్యోగాలు లభించే అవకాశాలున్నాయి. వాటిలో నాలుగు వేల మంది నిపుణులు (స్కిల్డ్‌), 7 వేల మంది ఔట్‌సోర్సింగ్‌ వర్కర్లను నియమిస్తారని తెలుస్తోంది. కియకు అనుబంధంగా కూడా అనేక పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి.