Jagan's-Drone-Shots-Fantasy-Kills-One-and-Injures--Manyఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ కు సంబందించిన చిత్రాలు ఇంకా వెలుగు చూస్తూనే ఉన్నాయి. అంతా సక్రమంగానే జరిగాయి అని ఎన్నికల సంఘం చెబుతున్నా వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగానే ఉన్నాయి. కడపలో కోడూరు బూత్ నెంబర్ 21లో 337 పురుష ఓటర్లు ఉన్నట్టు ఎన్నికల సంఘం విడుదల చేసిన ఓటర్ల లిస్టులో ఉంది. అయితే అక్కడ పోలింగ్ ముగిశాక 370 మంది పురుషులు ఓటు వేశారని రిటర్నింగ్ ఆఫీసర్ సంతకం పెట్టిన డాక్యుమెంట్ స్థానిక ఏజెంట్ల నుండి సేకరించింది టీడీపీ.

ఓటర్ల లిస్టు కంటే ఎక్కువ మంది ఓటు వెయ్యడం ఆంటే రిగ్గింగ్ జరిగినట్టేనని ఇక్కడ రిపోలింగ్ జరపాల్సిందే అని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. కడప జిల్లా ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ కు పెట్టని కోట. ఎప్పటినుండో ఇక్కడ రిగ్గింగ్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది అనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఉదంతం దానికి సాక్ష్యంగా నిలిచింది. ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ కు అనుకూలంగా వ్యవహరిస్తోంది అని అపవాదు ఉన్న ఎన్నికల సంఘం దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది చూడాలి.

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోని 5 పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్‌ జరపాలని భారత ఎన్నికల సంఘాన్ని కోరామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. నరసరావుపేట, గుంటూరు పశ్చిమ, కోవూరు, సూళ్లూరుపేట యర్రగొండపాలెం నియోజకవర్గల పరిధిలోని ఒక్కొక్క పోలింగ్ బూత్ లో రిపోలింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. వీరితో పాటు తెలుగుదేశం పార్టీ కంప్లయింట్ ను పరిగణలోకి తీసుకుని కడప లోకూడా రిపోలింగ్ కు ఆదేశిస్తారేమో చూడాలి.