andhra-pradesh-council--proceedingsమండలిలో తమకు ఉన్న ఆధిక్యతతో తెలుగుదేశం పార్టీ మరోసారి రాజధాని వికేంద్రీకరణను అడ్డుకుంది. అసలు ఆ బిల్లులు మండలిలో చర్చకు కూడా రాకుండా చెయ్యగలిగింది. ఎలాగైనా తమ పంతం నెగ్గించుకోవడానికి పదిహేను మంది మంత్రులను మండలిలో మోహరించారు ముఖ్యమంత్రి జగన్. అయినా ఉపయోగం లేకుండా పోయింది.

అయితే ఈ సందర్భంగా మండలిలో కొన్ని అభ్యంతర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. టీడీపీ ఎమ్మెల్సీ బీద రవిచంద్ర… మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ బాహాబాహీకి దిగారు. పోడియం దగ్గరకు చేరుకొని మంత్రులు గలాటా చేశారట. అప్పటికే మండలి లైవ్ ప్రొసీడింగ్స్ ఆపేస్తున్నారనే సమాచారంతో లోకేష్ అదంతా తన ఫోన్ లో వీడియో తీస్తున్నారు.

దీనితో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ లోకేష్ మీదకు దూసుకువచ్చి ఫోన్ లాక్కోబోయారని, లోకేష్ ని ఎటాక్ చెయ్యబోతుండగా… ఈ తరుణంలో మంతెన సత్యనారాయణరాజు, బీద రవిచంద్ర అడ్డుపడ్డారు. దీనితో ఇరుపక్షాల మధ్య కాసేపు గందరగోళం చోటు చేసుకుంది.

కీలక బిల్లులు ఆమోదించకుండానే సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు చైర్మన్‌ ప్రకటించారు. ఈ నేపథ్యంలో శాసనమండలి చైర్మన్‌ నిర్ణయాలు అప్రజాస్వామికంగా ఉన్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ విమర్శించడం కొసమెరుపు. అయితే విపక్ష ఎమ్మెల్సీలే తమ మంత్రి మీద దాడి చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ చెబుతుంది. ఏది ఏమైనా టీడీపీ మరోసారి మండలిలో మూడు రాజధానుల బిల్లులను అడ్డుకోగలిగింది.